ETV Bharat / sports

యువరాజ్​ ఆరు సిక్సర్ల ఘనతకు 13 ఏళ్లు - యువరాజ్​

2007 సెప్టెంబరు 19న ఇంగ్లాండ్​- భారత్ మధ్య జరిగిన టీ20 ప్రపంచ కప్​ మ్యాచ్ యువరాజ్​ సింగ్​ కెరీర్​లో ఓ మైలురాయి. ఆ మ్యాచ్​లోనే యూవీ వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ ఘనతకు నేటితో 13 ఏళ్లు పూర్తయ్యాయి.

Yuvraj Singh
యువరాజ్​
author img

By

Published : Sep 19, 2020, 12:58 PM IST

టీమ్​ఇండియా ఆల్​రౌండర్ యువరాజ్​ సింగ్​ బ్యాటింగ్​ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచకప్​లో ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​ యూవీ కెరీర్​లోనే ఓ మైలురాయి. అందులో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లతో ఆకలితో ఉన్న సింహంలా విరుచుకుపడ్డాడు. ఆ రోజు యూవీ ప్రదర్శన భారత క్రికెట్​ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేనిది. ఈ అరుదైన ఘనతకు నేటితో 13 ఏళ్లు పూర్తయ్యాయి.

ఈ సందర్భంగా యువరాజ్​ ఇన్​స్టాగ్రామ్​ వేదికగా అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. తన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఇంత త్వరగా సమయం ఎలా గడిచిపోయిందో తెలియడం లేదంటూ రాసుకొచ్చాడు.

ఈ మ్యాచ్​లో యువరాజ్ సింగ్​ 16 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే 12 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. భారత్​ 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేయగా.. ఆ తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లాండ్​ 200/6 పరుగులు చేసి ఓటమిపాలైంది.

గతేడాది అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించిన యూవీ ప్రస్తుతం దేశీయ క్రికెట్​లోకి తిరిగి అడుగుపెట్టబోతున్నట్లు తెలిపాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.