ETV Bharat / sports

'కోహ్లీ కంటే సచినే ఉత్తమ క్రికెటర్​'

వన్డేల్లో టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ కంటే సచిన్​ తెందూల్కర్ ఉత్తమ బ్యాట్స్​మన్​ అని మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల కంటే పాత నిబంధనల్లో పరుగులు సాధించడం కష్టమని తెలిపాడు.

Gambhir picks Tendulkar over Kohli in ODIs; considers longitivity, rule changes
'కోహ్లి కంటే సచినే ఉత్తమ బ్యాట్స్​మెన్​'
author img

By

Published : May 21, 2020, 3:14 PM IST

ప్రస్తుత టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ కంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ వన్డేల్లో ఉత్తమ బ్యాట్స్​మన్​ అని మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ అభిప్రాయపడ్డాడు. మారిన నిబంధనలతో పాటు వన్డేల్లో అతను​ కొనసాగిన ఎక్కువ సమయాన్ని బట్టి సచిన్ ఉత్తమమని భావిస్తున్నట్లు తెలిపాడు.

"ఒక్క బాల్​తో, పవర్​ప్లే సర్కిల్​లో నలుగురు ఫీల్డర్స్​ దానికి వెలుపల 5 మందికి మించి ఉండరాదు. అలాంటి సమయంలో సచిన్​ అన్ని పరుగులు సాధించాడు. అందుకే సచిన్ గ్రేట్. ప్రస్తుతం నిబంధనలు మారిపోయాయి. అవి చాలా మంది బ్యాట్స్​మెన్లకి ఉపయోగపడుతున్నాయి" అని గంభీర్​ స్పష్టం చేశాడు.

2 బంతులు, 3 పవర్​ప్లేలు

ప్రస్తుత క్రికెట్​లో ఇన్నింగ్స్​కు రెండు బంతులు ఉపయోగించడం సహా మూడు పవర్​ప్లేలు ఉంటున్నాయి. మొదటి పవర్​ప్లే (0-10 ఓవర్లు)లో సర్కిల్​ వెలుపల ఇద్దరు ఫీల్డర్స్​, రెండవ పవర్​ప్లే (10-40 ఓవర్లు)లో సర్కిల్​ బయట నలుగురు, చివరి పవర్​ప్లే (40-50 ఓవర్లు)లో ఐదుగురు ఫీల్డర్స్​ ఉంటారు. కొత్త నిబంధనల్లోనూ విరాట్​ కోహ్లి తన ఆటతీరుతో అద్భుతంగా ప్రదర్శన చేస్తున్నాడని గంభీర్​ అన్నాడు.

ప్రస్తుతం ఇన్నింగ్స్​కు రెండు కొత్త బంతులు వాడటం వల్ల రివర్స్​ స్వింగ్​, ఫింగర్​ స్పిన్ వాడకం తగ్గిపోయింది. 50 ఓవర్ల వరకు 5 ఫీల్డర్స్​ సర్కిల్​ లోపల ఉండటం బ్యాట్స్​మెన్లకు ఎంతగానో ఉపయోగపడుతోంది. పాత నిబంధనలు అమలులో ఉన్నప్పుడు వన్డేల్లో 230 నుంచి 240 చేస్తే చాలనుకునేవాళ్లం." అని గంభీర్ గుర్తు చేశాడు.

సచిన్​.. తన కెరీర్​లో 463 వన్డేలకు ప్రాతినిధ్యం వహించి 44.83 సగటుతో 18,426 పరుగులు సాధించాడు. అందులో 49 శతకాలు ఉన్నాయి. కోహ్లీ 248 వన్డేల్లో 59.33 సగటుతో 11,867 పరుగులు చేశాడు. 43 శతకాలతో కొనసాగుతున్నాడు.

ఇదీ చూడండి.. స్టేడియంలో శృంగార బొమ్మలు.. నిర్వాహకులకు జరిమాన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.