ETV Bharat / sports

'ఇంట్లో ఉండటం వల్ల దురద పుడుతోంది' - Ashwin Feeling itchy, want to go out and play

లాక్​డౌన్​తో ఇంట్లోనే ఉన్న తనకు, క్రికెట్ ఆడకపోవడం వల్ల దురద పుడుతోందని చెప్పాడు బౌలర్ అశ్విన్. బయటకు వెళ్లి ఆడాలనిపిస్తోందని అన్నాడు.

ravichandran
రవిచంద్రన్​
author img

By

Published : Jun 4, 2020, 8:18 PM IST

ఈ లాక్​డౌన్​తో దాదాపు రెండు నెలలుగా ఇంట్లోనే ఉన్న తన చేతులకు దురద పుడుతోందని అన్నాడు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. క్రికెట్ ఆడేందుకు త్వరగా బయటకు వెళ్లాలనిపిస్తోందని అన్నాడు. సద్గురుతో ఆన్​లైన్​ చాట్​లో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకున్నాడు.

చెన్నైలోని తన స్వగృహంలో ఉంటున్న అశ్విన్.. పలువురు క్రికెటర్లలా ప్రాక్టీసుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే తను ప్రస్తుతం ఫిట్​గానే ఉన్నానని చెప్పుకొచ్చాడు. మైదానంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.

"లాక్​డౌన్​ ప్రారంభంలో బాగానే ఉంది. కానీ, ప్రస్తుతం ఇంట్లోనే ఉండిపోయి, క్రికెట్ ఆడకపోవడం వల్ల దురద వేస్తోంది. బయటకు వెళ్లి ఆడాలని, ఇంకేదైనా చేయాలని ఉంది" -రవిచంద్రన్ అశ్విన్​, భారత స్పిన్నర్

భారత్ తరఫున ఆడుతున్న అశ్విన్.. ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ టోర్నీ.. కరోనా కారణంగా నిరవధిక వాయిదా పడింది. దీనిని సెప్టెంబరు-నవంబరు మధ్య కాలంలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.

ఇదీ చూడండి : 'కోహ్లీని రోహిత్ శర్మతో​ పోల్చడం సరికాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.