ETV Bharat / sports

ద్రవిడ్​కు జీవితాంతం రుణపడి ఉంటా: పుజారా​ - dravid taught the lesson switching off to pujara

తన జీవితంపై టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ రాహుల్​ ద్రవిడ్​ ప్రభావం చాలా ఉందని తెలిపాడు టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్​ పుజారా. క్రికెట్లో ఓ దశకు చేరుకున్నాక అందులో​నుంచి వైదొలగడమనేది ఎంత ముఖ్యమో అర్థమయ్యేలా తెలియజేశాడని చెప్పాడు.

dravid
ద్రావిడ్​
author img

By

Published : Jun 27, 2020, 2:54 PM IST

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ రాహుల్​ ద్రవిడ్​పై ప్రశంసల వర్షం కురిపించాడు టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్​ పుజారా. ఆయన నుంచి తాను ఎంతగానో స్ఫూర్తి పొందినట్లు తెలిపాడు. తన జీవితంపై మిస్టర్ డిపెండబుల్​ ప్రభావం చాలా ఉందని వెల్లడించాడు.

ముఖ్యంగా క్రికెట్​లో ఓ దశకు చేరుకున్నాక అందులో నుంచి వైదొలగడం​ ఎంత ముఖ్యమో ద్రవిడ్ తెలిసేలా చేశాడని వివరించాడు పుజారా. వ్యక్తిగత, వృత్తి పరమైన జీవితాలను ఎలా వేరుగా చూడాలో వివరణాత్మకంగా తెలియచెప్పాడని వెల్లడించాడు. అనంతరం క్రికెట్​కు మించిన ఓ జీవితం ఉందని గుర్తుపెట్టుకోవాలని సూచించినట్లు తెలిపాడు. అందుకని ద్రవిడ్​కు జీవితకాలం రుణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు.

"క్రికెట్​ నుంచి బయటకు రావడమనేది ఎంత ముఖ్యమో ద్రవిడ్ అర్థమయ్యేలా వివరించాడు. నాకు దానిపై కొంచెం అవగాహన ఉన్నప్పటికీ.. పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చేలా తెలియజేశాడు. సీనియర్​ క్రికెటర్లు వ్యక్తిగత, వృత్తి పరమైన జీవితాలను ఎలా వేరుగా ఉంచుతారో నాకు తెలుసు. అలా ఉంచడం ఎంతో ముఖ్యమని భావిస్తాను. క్రికెట్​కు మించిన ఓ జీవితం ఉంది. "

-చెతేశ్వర్​ పుజారా, టీమ్​ఇండియా క్రికెటర్

చాలా మంది తన ఆలోచన ధోరణి, బ్యాటింగ్​ టెక్నిక్​ను ద్రవిడ్​తో పోల్చినప్పటికీ.. తానెప్పుడు ఆయనను అనుకరించడానికి ప్రయత్నించలేదని చెప్పుకొచ్చాడు పుజారా. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర జట్టుకు ఆడటం వల్లనే తన ఆట మెరుగుపడిందని తెలిపాడు.

మొత్తంగా కెరీర్‌లో 164 టెస్టుల్లో 13,288 పరుగులు, 344 వన్డేల్లో 10,889 పరుగులు చేశాడు ద్రవిడ్​. 79 వన్డేల్లో భారత జట్టుకు సారథిగా వ్యవహరించగా.. అందులో 42సార్లు జట్టుకు విజయాన్ని అందించాడు.

ఇది చూడండి : 16 మంది ఎన్​బీఏ ఆటగాళ్లకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.