కరోనా సోకకుండా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు బీసీసీఐ 'టీమ్ మాస్క్ ఫోర్స్' పేరిట ఓ కొత్త వీడియోను ట్వీట్ చేసింది. ఇందులో పలువురు ప్రముఖ క్రికెటర్లు, మాజీలు.. జనం ఎక్కువగా ఉండే చోట్ల మాస్క్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. దేశంలోని ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వీడియోలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, హర్మన్‌ప్రీత్‌కౌర్, వీరేందర్ సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, మిథాలీ రాజ్, స్మృతి మంధాన ఉన్నారు. దీనితో పాటే అందరూ 'ఆరోగ్యసేతు' మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని బీసీసీఐ ట్వీట్ చేసింది. మాస్క్ ఎలా తయారుచేసుకోవచ్చే ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించింది.
"టీమిండియాలో భాగం కావడం గర్వించదగ్గ విషయం. కానీ ఈ రోజు అంతకంటే పెద్ద టీమ్ మనమందరం అవుదాం. అదే 'టీమ్ మాస్క్ ఫోర్స్' అంటూ కోహ్లీ మాటలతో ఈ వీడియో ప్రారంభం అవుతుంది. కోహ్లీ మాస్క్ ధరిస్తాడు. అనంతరం ఇందులో పాల్గొన్న క్రికెటర్స్ మాస్క్ ధరించడం ప్రాముఖ్యతను వివరిస్తూ వాటిని ముఖానికి పెట్టుకుంటారు. తాము వీటిని స్వయంగా ఇంట్లోనే తయారు చేసుకున్నట్లు చెప్పారు. ప్రతిఒక్కరూ తమ ఇంట్లో మాస్క్‌ను రూపొందించుకోవాలని సూచించారు.
-
#TeamIndia is now #TeamMaskForce!
— BCCI (@BCCI) April 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Join #IndiaFightsCorona and download @mygovindia's @SetuAarogya mobile application 📱@PMOIndia @narendramodi 🇮🇳 pic.twitter.com/M06okJhegt
">#TeamIndia is now #TeamMaskForce!
— BCCI (@BCCI) April 18, 2020
Join #IndiaFightsCorona and download @mygovindia's @SetuAarogya mobile application 📱@PMOIndia @narendramodi 🇮🇳 pic.twitter.com/M06okJhegt#TeamIndia is now #TeamMaskForce!
— BCCI (@BCCI) April 18, 2020
Join #IndiaFightsCorona and download @mygovindia's @SetuAarogya mobile application 📱@PMOIndia @narendramodi 🇮🇳 pic.twitter.com/M06okJhegt
కరోనా కట్టడిలో భాగంగా ప్రధానమంత్రి సహాయనిధికి ఇటీవలే రూ.51 కోట్లు విరాళమిచ్చింది బీసీసీఐ. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 14500 మంది ఈ వైరస్ బారిన పడగా... 496 మంది మృత్యువాత పడ్డారు.
ఇదీ చూడండి : కేఎల్ రాహుల్‌కు ముద్దుగుమ్మ అతియా స్పెషల్ విషెస్