ETV Bharat / sports

ఎనిమిదేళ్ల అభిమానికి పాక్​ క్రికెటర్​ చిట్కాలు - latest cricket news udpates

పాకిస్థాన్​ క్రికెటర్​ బాబర్​ అజామ్​ ఎనిమిదేళ్ల అభిమానితో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సంభాషించాడు. ఇటీవలే సామియా అనే బాలిక క్రికెట్​ ప్రాక్టీస్​ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఆటతీరును మెచ్చుకున్నాడు బాబర్​.

Babar Azam Shares Tips With 8-Year-Old Fan
బాబర్​ అజామ్​
author img

By

Published : Jul 15, 2020, 7:44 PM IST

ఇటీవలే పాకిస్థాన్​ లాహోర్​కు చెందిన ఎనిమిదేళ్ల సామియా అఫ్సర్​.. క్రికెట్​ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యింది. ఈ క్రమంలోనే అనేక మంది క్రికెటర్లు ఈ చిన్నారి క్రికెటర్​పై ప్రశంసలు కురిపించారు. తాజాగా, సామియాకు ఎంతో ఇష్టమైన పాక్​​ బ్యాట్స్​మన్​ బాబర్​ అజామ్​.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సంభాషించాడు. ఈ క్రమంలోనే సామియా ఆటతీరును ప్రశంసించాడు బాబర్​. ఆమె బ్యాటింగ్ టైమింగ్​ అద్భుతమని అన్నాడు. ఇంకా మంచి బ్యాట్స్​మన్​గా ఎలా రాణించాలో కొన్ని చిట్కాలనూ పంచుకున్నాడు బాబర్​.

Babar Azam Shares Tips With 8-Year-Old Fan
బాబర్​ అజామ్​

ఈ సంభాషణ అనంతరం బాబర్​ మాట్లాడుతూ.. "ఆటలో ఆభిమానులు అంతర్భాగమైపోతారు. వారే మమ్మల్ని గెలుపు దిశగా ప్రేరేపిస్తారు. ఇటువంటి వారు మా విజయం కోసం ప్రార్థిస్తూ.. మా వెనకే ఉన్నారని తెలిసినప్పుడు మరింత ఉత్సాహంతో మ్యాచ్​ను అడతాం." అని బాబర్​ పేర్కొన్నాడు.

కరోనా పరిస్థితులు మెరుగుపడిన అనంతరం.. సామియాను తప్పకుండా కలుస్తానని బాబర్​ అన్నాడు. సామియా ప్రాక్టీస్​ వీడియోకు శ్రీలంక క్రికెటర్​ కుమార సంగక్కర కూడా ముగ్దుడయ్యాడు. తన కంటే మంచి టెక్నిక్​తో ఆడుతున్నట్లు తెలిపాడు. ఇటువంటి వారి ప్రతిభను ప్రోత్సాహించాలని సూచించాడు.

ఇంగ్లాండ్​కు- పాకిస్థాన్​ మధ్య జరగనున్న మూడు టెస్టుల సిరీస్​లో భాగంగా.. ప్రస్తుతం అజామ్​ ఇంగ్లాండ్​ పర్యటనలో ఉన్నాడు. తొలి టెస్టు ఆగస్టు 5న ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి:'దిల్‌ బెచారా' నుంచి మరో ప్రేమగీతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.