ETV Bharat / sports

పాలు అమ్ముతూ.. కూలీ పనులు చేస్తూ - Wheelchair Cricket

లాక్​డౌన్​ కారణంగా చాలా మంది క్రీడాకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిలో భారత వీల్​ఛైర్​ క్రికెటర్లూ ఉన్నారు. జీవనోపాధి కోసం వ్యవసాయ కూలీలుగా, ఇతర పనులను చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బీసీసీఐ తమను ఆదుకుంటుదేమోనని ఎదురుచూస్తున్నారు.

All You Need to Know About India's Wheelchair Cricket Team
పాలు అమ్ముకుంటూ..కూలీలుగా బతుకునీడుస్తున్న క్రికెటర్లు
author img

By

Published : Aug 6, 2020, 8:17 AM IST

వాళ్లూ బ్లూ జెర్సీ వేసుకునే క్రికెటర్లే అయినా, వాళ్లూ భారత్​కే ఆడుతున్నా.. వాళ్ల జీవితాలు మిగతా భారత క్రికెటర్లలా కాదు. జీవనం సాగడమే కష్టంగా ఉన్న వీల్​ఛైర్​ క్రికెటర్లు.. బీసీసీఐ ఎప్పుడు తమను ఆధీనంలోకి తీసుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు.

వ్యవసాయ కూలీగా..

వీల్​ఛైర్​ క్రికెట్లో భారత వికెట్​ కీపర్​ నిర్మల్​ సింగ్​ దిల్లాన్​ది పంజాబ్​లోని మోగా. అతడు పాలు అమ్మడాన్ని జీవనోపాధిగా ఎంచుకుంటే.. ఫాస్ట్​బౌలర్​ సంతోష్​ రంజగానె కొల్హాపూర్​లోని వెల్డింగ్​ దుకాణంలో పనిచేస్తున్నాడు. లాక్​డౌన్​ కారణంగా వ్యాపారాలన్నీ మూతపడడం వల్ల అతడు వ్యవసాయ కూలీగా మారాడు. రోజుకు వచ్చేది రూ.150 రూపాయలే. వీళ్లంతా ఇటీవల కాలంలో మంచి విజయాలు సాధించిన భారత వీల్​ఛైర్​ జట్టు సభ్యులే. కానీ బీసీసీఐ పరిధిలో లేకపోవడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు.

కమిటీ ఏర్పాటుకు సిఫార్సు

లోధా కమిటీ సూచించిన సంస్కరణల ప్రకారం దివ్యాంగ క్రికెటర్ల అభివృద్ధి కోసం బీసీసీఐ ఓ కమీటీని ఏర్పాటు చేయాల్సిఉంది. కానీ బీసీసీఐ ఇప్పటివరకు ఆ పని చేయలేదు. ఈ విషయంపై బోర్డు అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ.. భారత వీల్​ఛైర్​ క్రికెట్​ సంఘం ముఖ్య కార్యనిర్వహణాధికారితో చర్చలు కూడా జరిపాడని వీల్​ఛైర్​ జట్టు కెప్టెన్​ సోమ్​జీత్​ సింగ్​ తెలిపాడు.

గంగూలీ హామీ ఇచ్చారు

"దివ్యాంగ క్రికెటర్లకు సంబంధించిన కమిటీ ఏర్పాటుపై బీసీసీఐ నుంచి మాకు ఎలాంటి సమాచారమూ లేదు. సహాయం చేస్తానని గంగూలీ హామీ ఇచ్చాడు" అని సోమ్​జీత్​ చెప్పాడు. 24 ఏళ్ల సోమ్​జీత్ ఉత్తరప్రదేశ్​లో తొలిసారి వీల్​ఛైర్​ క్రికెటర్ల సంఘం ఏర్పాటులో, ఆ తర్వాత స్క్వాడ్రన్​ లీడర్​ అభయ్​ ప్రతాప్​ సింగ్​తో కలిసి జాతీయ సంఘం ఏర్పాటులో కీలకపాత్ర పోషించాడు. వీల్​ఛైర్​ క్రికెటర్లతో పాటు అంధ, బధిర క్రికెటర్లు కూడా బీసీసీఐ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.