కరోనా కారణంగా ఆగిపోయిన అంతర్జాతీయ క్రికెట్‌ను తిరిగి ఆరంభించేందుకు ఐసీసీ సిద్ధమవుతోంది. తిరిగి ఆట మొదలెట్టేందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించే పనిలో పడింది. మ్యాచ్‌కు ముందు 14 రోజుల పాటు ఐసోలేషన్ శిక్షణ శిబిరం నిర్వహించి ఆటగాళ్లకు తరచుగా ఆరోగ్య, కరోనా పరీక్షలు నిర్వహించాలని ఐసీసీ ప్రతిపాదించింది.
"మ్యాచ్‌కు ముందు ఐసోలేషన్ శిక్షణ శిబిరం నిర్వహించి ఆటగాళ్ల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలి. శరీర ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడూ పరీక్షించడం సహా కరోనా పరీక్షలు చేయాలి. ఉదాహరణకు ఏ జట్టయినా ప్రయాణానికి ముందు 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంటే అది కరోనా రహిత జట్టుగా మారుతుంది. తిరిగి శిక్షణ, మ్యాచ్‌లు ఆరంభించేందుకు వీలుగా ప్రభుత్వం సూచించే నిబంధనలను అమలు పరిచేందుకు ప్రధాన వైద్యాధికారులను నియమించే విషయాన్ని పరిగణలోకి తీసుకోనున్నాం" అని ఐసీసీ తెలిపింది.
మైదానంలోని అంపైర్లు బంతిని పట్టుకోవాలంటే చేతులకు తప్పనిసరిగా గ్లౌజులు ధరించాలని పేర్కొంది. ఆటగాళ్ల మధ్య ఎప్పటికీ 1.5 మీటర్ల దూరం ఉండాలని, తమ వ్యక్తిగత కిట్లు, సామగ్రిని ఎప్పటికప్పుడూ శానిటైజ్ చేసుకోవాలని ఐసీసీ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి.. 'ఇంటికి రంగులేశా.. అమ్మకు సాయం చేస్తున్నా'