Cheteshwar Pujara: ఫామ్ కోసం కౌంటీ బాట పట్టిన భారత టెస్టు జట్టు సీనియర్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా అరంగేట్రంలో డబుల్ సెంచరీతో మెరిశాడు. డెర్బీషైర్‌తో మ్యాచ్‌లో ససెక్స్ తరఫున ఆడుతూ తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులే చేసిన పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో 201 పరుగులతో అజేయంగా నిలిచి ఫాలోఆన్ ఆడుతున్న జట్టుకు ఓటమి తప్పించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 387 బంతులు ఆడిన పుజారా.. 23 ఫోర్లు కొట్టాడు.
పుజారాతో పాటు కెప్టెన్ టామ్ హైన్స్ (243) కూడా డబుల్ సెంచరీ చేయడం వల్ల ఈ మ్యాచ్‌ను ససెక్స్ డ్రాగా ముగించింది. ఆట నిలిపి వేసే సమయానికి ససెక్స్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 513 పరుగులు చేసింది. డెర్బీషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 505/8 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా.. ససెక్స్ 174 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌కు ఆజింక్య రహానెతో పాటు పుజారాను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోని సంగతి తెలిసిందే.
ఇదీ చూడండి: అతడి కెరీర్ 12 ఏళ్లు.. కానీ ఆడింది మాత్రం 22 మ్యాచులే