Big Bash League Toss : క్రికెట్ ప్రపంచంలో ఏదో ఒక వింత ఘటన జరుగుతూనే ఉంటుంది. కొన్ని సార్లు అవి పెద్ద కాంటవర్సీలకు దారి తీస్తే మరికొన్ని మాత్రం నవ్వు తెప్పిస్తాయి. తాజాగా ఆస్ట్రేలియాలో ఇదే జరిగింది. ఆసీస్ వేదికగా మంగళవారం జరిగిన బిగ్ బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్స్ తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో రెండుసార్లు టాస్ వేయాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా అక్కడి వారు షాకయ్యారు. ఆ తర్వాత నవ్వుకున్నారు.
అక్కడ బ్యాటే టాస్
బీబీఎల్‌లో సాధారణంగా టాస్‌ను కాయిన్‌తో కాకుండా బ్యాట్‌తో వేస్తారు. ఈ టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే రూల్ కొనసాగుతోంది. బ్యాటు బోర్లా పడటం, పడకపోవడం లాంటి గుర్తులను పరిగణనలోకి తీసుకుని టాస్ నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనూ బ్యాట్‌తోనే టాస్ వేశారు. టాస్ వేసేందుకు సిడ్నీ థండర్ కెప్టెన్ క్రిస్ గ్రీన్, బ్రిస్బేన్ హీట్ కెప్టెన్ కోలిన్ మున్రో ముందుకొచ్చారు. ఇక బ్యాట్‌ను గాల్లోకి విసిరి రిజల్డ్ కోసం ఎదురుచూశారు. కానీ బ్యాట్ ఎటూ పడకుండా సరిగ్గా మధ్యలో నిలబడింది. దీంతో నిర్వాహకులు ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత ఏం చేయాలో తోచక మరోసారి టాస్ వేసేందుకు ప్రయత్నించారు. అలా రెండోసారి బ్యాట్‌ను విసరగా అది ఓ వైపుకు పడింది. దీంతో సిడ్నీ థండర్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
-
Toss happened for the 2nd time in the BBL due to the bat flip. 😂 pic.twitter.com/kcL9wNjAA1
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Toss happened for the 2nd time in the BBL due to the bat flip. 😂 pic.twitter.com/kcL9wNjAA1
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2023Toss happened for the 2nd time in the BBL due to the bat flip. 😂 pic.twitter.com/kcL9wNjAA1
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2023
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. దీన్ని చూసిన క్రికెట్ లవర్స్ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొంతమందేమో ఈ వీడియోను చూసి నవ్వుకుంటూ ఇతరులకు షేర్ చేస్తుండగా, మరికొందరు మాత్రం నిర్వాహకుల తీరు పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. టాస్‌ను బ్యాట్‌తో వేయకుండా కాయిన్‌తో వేయ్యొచ్చు అంటూ సెటైర్లు వేస్తున్నారు.
పిచ్ బాలేదని మ్యాచ్ రద్దు
మరోవైపు ఇదే లీగ్‌లో మరో అనూహ్యమైన ఘటన జరిగింది. ఇటీవలే జరిగిన మెల్ బోర్న్ రెనిగేడ్స్ - పెర్త్ స్కార్చర్స్ మ్యాచ్‌ను పిచ్ కారణంగా రద్దు చేశారు. 6.5 ఓవర్ల పాటు సాగిన మ్యాచ్‌ను ఆ తర్వాత అంపైర్లు రద్దు చేశారు. పిచ్ ప్రమాదకరంగా ఉందని, భిన్నంగా స్పందిస్తూ బాల్స్ బౌన్స్ అవుతున్నాయంటూ మ్యాచ్‌ను నిలిపివేసి ఇరు జట్లకు పాయింట్లను సమానంగా పంచారు.
బంగ్లా ప్లేయర్ వెరైటీ ఔట్ - బ్యాడ్‌లక్ అంటే అతడిదే!
కీపర్ ప్యాడ్‌లో చిక్కుకున్న బంతి- డేంజర్‌గా మారిన పిచ్- క్రికెట్లో విచిత్ర సంఘటనలు