ETV Bharat / sports

17 సిక్స్​లు, 8 ఫోర్లతో 'స్టోక్స్'​ వీరబాదుడు.. ఒక్క ఓవర్లోనే 34 పరుగులు - కౌంటీ క్రికెట్​

Ben stokes batting record: ఇంగ్లాండ్​ టెస్ట్​ జట్టు సారథిగా ఇటీవలే నియామకమైన బెన్​ స్టోక్స్​.. కౌంటీ క్రికెట్​లో అదరగొట్టాడు. ఒకే ఇన్నింగ్స్​లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్​గా రికార్డ్​ సృష్టించాడు. డర్హమ్​ తరఫున ఆడుతున్న స్టోక్స్​ మొత్తం 17 సిక్సర్లతో 64 బంతుల్లోనే సూపర్​ సెంచరీ చేశాడు.

Ben Stokes hits 64-ball century
బెన్​ స్టోక్స్​ సూపర్​ సెంచరీ
author img

By

Published : May 7, 2022, 7:56 AM IST

Ben stokes batting record: ఇంగ్లాండ్​ టెస్ట్​ కెప్టెన్​, డర్హమ్ జట్టు​ ఆల్​రౌండర్​ బెన్​ స్టోక్స్​ కౌంటీ క్రికెట్​లో అరుదైన రికార్డ్​ సృష్టించాడు. ఒకే ఇన్నింగ్స్​లో 17 సిక్సులు బాదాడు. ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమండ్స్​ను వెనక్కి నెట్టి కౌంటీ క్రికెట్​లో ఓ ఇన్నింగ్స్​లో అత్యధిక సిక్సులు కొట్టిన వ్యక్తిగా నిలిచాడు. 1995లో జరిగిన కౌంటీ క్రికెట్​లో గ్లూసెస్టర్​షైర్​ తరఫున ఆడిన సైమండ్స్​ 16 సిక్సర్లు బాదాడు. 2011లో ఎసెక్స్​ ప్లేయర్​ గ్రాహం​ నేపియర్​ ఒకే ఇన్నింగ్స్​లో 16 సిక్సర్లు కొట్టి సైమండ్స్​ సరసన నిలిచాడు. తాజాగా బెన్​ స్టోక్స్​ వారి రికార్డును తిరగరాశాడు.

వోర్సెస్టర్​లోని న్యూరోడ్​లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్​షిప్​ డివిజన్​ టు 2022లో వోర్సెస్టర్​​షైర్​పై ఈ ఫీట్​ను సాధించాడు బెన్​ స్టోక్స్​. జోష్​ బేకర్​ వేసిన ఓవర్​లో వరుసగా ఐదు సిక్సర్లు, ఓ ఫోర్​తో 34 పరుగులు రాబట్టాడు. దీంతో 59 బంతుల్లో 70 పరుగుల నుంచి​.. 64 బంతుల్లోనే 100 పరుగులకు చేరుకున్నాడు. ఆ తర్వాత ధాటిగా ఆడిన బెన్​స్టోక్స్​ 88 బంతుల్లోనే 161 పరుగులు (8 ఫోర్లు, 17 సిక్సర్ల) చేసి స్పిన్నర్​ బ్రెట్​ బౌలింగ్​లో పెవిలియన్​ చేరాడు.

​స్టోక్స్​ విధ్వంసంతో ఆట ముగిసే సమయానికి డర్హమ్​ జట్టు 128 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 580 పరుగులు చేసింది. సీన్​ డిక్సన్​(104), కీగన్​ పీటర్సన్​(50), కెప్టెన్​ స్కాట్​ బొర్త్​విక్​(89), డేవిడ్​ బెడింగమ్​(135) రాణించారు. వోర్సెస్టర్​షైర్​ బౌలర్​ బెన్​ గిబ్బన్​ 25 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు.
ఇంగ్లాండ్​ టెస్ట్​ కెప్టెన్సీ నుంచి జో రూట్​ తప్పుకున్న తర్వాత.. స్టోక్స్​ను సారథిగా నియమిస్తున్నట్లు గత నెలలో ప్రకటించింది ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు. రూట్​ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్న ​స్టోక్స్​ ఇంగ్లాండ్​ పురుషుల టీమ్​కు సారథ్యం వహించనున్న 81 వ్యక్తిగా నిలవనున్నాడు.​

ఇదీ చూడండి: కఠిక పేదరికం.. కడుపు నిండా తిండి లేని దైన్యం.. కల మాత్రం ఒక్కటే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.