asia cup 2023 ind vs pak venue : ఆసియా కప్ 2023 ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. హైబ్రీడ్ మోడల్‌లో ఈ మెగాటోర్నీ జరగనుంది. శ్రీలంక, పాకిస్థాన్.. ఈ ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. నాలుగు మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరగనుండగా.. తొమ్మిది మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా నిర్వహించనున్నారు.
అయితే ఈ ఆసియాకప్‌లో టీమ్ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ వేదిక గురించి ఇంకా చర్చ సాగుతోంది. అయితే తాజాగా దీనిపై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పష్టతనిచ్చారు. ఆసియా కప్ కోసం భారత జట్టు.. పాకిస్థాన్ వెళ్లబోతుందని పాక్ మీడియాలో వచ్చిన కథనాల్ని కొట్టిపారేశారు. అలాగే చర్చల కోసం జైషా కూడా పాకిస్థాన్‌కు వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు. పాక్‌కు భారత్ వెళ్లట్లేదని.. ఇద్దరి మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను శ్రీలంకలో నిర్వహించబోతున్నారని ఆయన తెలిపారు. దీంతో 2010 తరహాలోనే.. టీమ్ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ డంబుల్లా మైదానం వేదికగా జరిగే అవకాశం ఉంది.
asia cup 2023 schedule : "మా కార్యదర్శి జైషా పీసీబీ హెడ్ జాకా అష్రఫ్‌ను కలిశారు. ఆసియా కప్ షెడ్యూల్ కూడా ఖరారైంది. పాకిస్థాన్ వేదికగా నాలుగు లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత శ్రీలంక వేదికగా 9 మ్యాచులు జరగనున్నాయి. ఒకవేళ ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడితే.. ఆ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే నిర్వహిస్తారు" అని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు. కాగా, ఈ శుక్రవారం(జులై 14) ఆసియా కప్ 2023 పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశముంది.
జైషాతో సమావేశంపై పీసీబీ చీఫ్ మాట్లాడుతూ.. ''జై షాతో సమావేశం మంచి ఆరంభం అని ఆశిస్తున్నాను. ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడం మాకు సమ్మతమే. భవిష్యత్‌లోనూ భారత్-పాకిస్థాన్ క్రికెట్ మైత్రి బంధం బలపడే అవకాశాలు ఉన్నాయి. బంధాన్ని మరింత బలంగా మార్చుకుంటూ ముందుకు సాగుతాం'' అని అన్నారు. కాగా, 2016 తర్వాత భారత ఉపఖండంలో జరగనున్న మొదటి ఆసియా కప్ ఇదే. ఆ ఏడాది బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చింది. అనంతరం 2018, 2022 యూఏఈ వేదికగా జరిగింది.
ODI worldcup 2023 ind vs pak : ఇకపోతే ఈ ఆసియా కప్ 2023 ముగిసిన తర్వాత జరగబోయే వన్డే ప్రపంచకప్‌లో భాగంగా టీమ్ఇండియా-పాకిస్థాన్.. అక్టోబర్ 15న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా తలపడనున్నాయి.
ఇదీ చూడండి :
IND vs WI team squad 2023 : ఓపెనర్‌గా యశస్వి జైశ్వాల్.. మూడో స్థానంలో గిల్
రూ.1.27 లక్షల కోట్లకు ఐపీఎల్ విలువ.. నెంబర్ 1 టీమ్ ఏదో తెలుసా?