ETV Bharat / sports

క్రికెట్​ ఫ్యాన్స్​కు గుడ్ ​న్యూస్.. 15 రోజుల్లో మూడు భారత్​- పాక్​ మ్యాచ్​లు! - ఆసియా కప్

భారత్​-పాక్​ మ్యాచ్​ అంటే క్రికెట్​ అభిమానులకు చాలా ప్రత్యేకం. మెగా ఈవెంట్లలో మాత్రమే తలపడే ఈ రెండు జట్లకు ఈసారి ఆసియాకప్​లో 15 రోజుల వ్యవధిలో మూడు సార్లు పోటీపడే అవకాశం వచ్చింది. ఇంతకీ ఈ జట్లు టోర్నీలో మూడు సార్లు ఎలా తలపడతాయి అంటే..

ind vs pak
భారత్​ పాక్
author img

By

Published : Aug 4, 2022, 8:53 PM IST

Asia cup 2022: ఇండియా X పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే క్రికెట్‌ అభిమానులకు ఎప్పుడూ పండగే. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ వంటి మెగా ఈవెంట్లలోనే క్రికెట్‌ ప్రేమికులకు ఈ ముచ్చట తీరుతుంది. అయితే, ఈ సారి ఆసియా కప్‌ పుణ్యమా అని 15 రోజుల వ్యవధిలో భారత్‌, పాక్‌ మూడు సార్లు పోటీపడే అవకాశం ఉంది. ఈ నెల 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్‌ ప్రారంభం కానుంది. భారత్‌ డిఫెడింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా, గత ఏడాది భారత్‌ను టీ20 ప్రపంచకప్‌లో ఓడించామన్న ఉత్పాహంతో పాక్‌ ఆసియా కప్‌కు సిద్ధం అవుతోంది.

3 సార్లు ఎలా అంటే..!
ఈ ఏడాది ఆసియా కప్‌లో మొత్తం ఆరు జట్లు పోటీపడతాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు ఏ లో భారత్‌, పాక్‌లతోపాటు మరో క్వాలిఫయర్‌ జట్టు ఉంటుంది. ఈ గ్రూపులో అర్హత సాధించేందుకు యూఏఈ, సింగపూర్, హాంకాంగ్, కువైట్ క్వాలిఫయింగ్‌ మ్యాచులు ఆడుతాయి. ఈ నెల 28న దుబాయ్‌ వేదికగా పాక్‌తో, ఆ తర్వాత 31న క్వాలిఫయర్‌ జట్టుతో టీమ్‌ఇండియా తలపడుతుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఒకటి నెగ్గినా భారత్‌ సూపర్‌ 4కు అర్హత సాధిస్తుంది. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెప్టెంబర్‌ 4న సూపర్‌ 4లో తలపడతాయి. గ్రూప్‌ ఏలో భారత్‌, పాక్‌లు కొత్తజట్టుపై గెలవడం దాదాపు ఖాయం. దీంతో ఈ రెండు జట్లే సూపర్‌ 4లో మరోసారి ఆడే అవకాశం ఉంది.

మరోవైపు గ్రూప్‌ బిలో శ్రీలంక, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ ఉన్నాయి. బి గ్రూప్‌లో టాప్‌2 జట్లు సూపర్‌ 4లో మరోసారి ఆడుతాయి. ఇలా రెండు గ్రూపుల్లోని టాప్‌ 2 జట్లు సూపర్‌ 4లో మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడతాయి. అన్ని మ్యాచ్‌లు పూర్తయ్యాక, ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్లు సెప్టెంబర్‌ 13న ఫైనల్‌ పోరులో టైటిల్‌ కోసం పోటీపడతాయి. ప్రస్తుత ఫామ్‌ చూస్తే భారత్‌, పాక్‌లే ఫేవరేట్‌లుగా బరిలోకి దిగుతున్నాయి. దీంతో సూపర్‌ 4లో కూడా ఈ రెండు జట్లే ఆధిపత్యం చలాయించి, ఫైనల్‌లో మరోసారి తలపడే అవకాశం ఉంది. అభిమానులు ఈ ఆసియా కప్‌లో దాయాదుల సమరాన్ని మూడుసార్లు వీక్షించే ఛాన్స్‌లే ఎక్కువ. అయితే, ఏం జరుగుతుందో ఆసియా కప్‌లో చూడాలి.

ఇదీ చూడండి : ప్రభాస్​, కోహ్లీల 'హర్ ఘర్ తిరంగా' సాంగ్.. మనసంతా త్రివర్ణమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.