ETV Bharat / sports

జిడ్డు బ్యాటింగ్​.. 400 నిమిషాలు క్రీజులో.. 280 బాల్స్​లో 46 రన్స్​ - ఆష్లే చంద్రసింఘే 403 నిమిషాలు

131 ఏళ్ల షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీ చరిత్రలో మరో జిడ్డు బ్యాటింగ్ నమోదైంది. షీల్డ్​ ఫైనల్​ మ్యాచ్​లో విక్టోరియా ప్లేయర్​ ఆష్లే చంద్రసింఘే 403 నిమిషాలు క్రీజ్‌లో నిలబడి రికార్డుకెక్కాడు. ఆ వివరాలు..

Ashley 400 minutes crease in shield final

author img

By

Published : Mar 25, 2023, 5:27 PM IST

Updated : Mar 25, 2023, 6:34 PM IST

131 ఏళ్ల షెఫీల్డ్‌ షీల్డ్‌ టోర్నీ చరిత్రలో మరో అరుదైన రికార్డు నమోదైంది. ప్రస్తుత సీజన్​లో ఓ బ్యాటర్​ అత్యంత జిడ్డు బ్యాటింగ్‌ ఆడి ఆకట్టుకున్నాడు. షీల్డ్‌ 2022-23 ఫైనల్​లో వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్​లో విక్టోరియా ప్లేయర్​ ఆష్లే చంద్రసింఘే.. 403 నిమిషాల పాటు క్రీజులోనే నిలబడి రికార్డుకెక్కాడు. ఆచితూచి ఒక్కో బంతిని ఎదుర్కొన్నాడు. మొత్తంగా 280 బాల్స్​ను ఎదుర్కొని 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ప్రదర్శనతో.. షీల్డ్​ టోర్నీలో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు 1997-98 సీజన్‌ ఫైనల్​ మ్యాచ్​లో టాస్మానియా ప్లేయర్​ జేమీ కాక్స్‌ కూడా ఇలాంటి ప్రదర్శనే చేశాడు. 267 బాల్స్​ను ఎదుర్కొని 115 పరుగులతో అజేయంగా నిలిచి ఆకట్టుకున్నాడు.

అయితే ఈ రికార్డుతో పాటు చంద్రసింఘే మరి కొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. షీల్డ్‌ టోర్నీ చరిత్రలో 46 పరుగులు చేసేందుకు అత్యధిక బంతులను ఎదుర్కొన్న ప్లేయర్​గా నిలిచాడు. అలాగే షీల్డ్‌ ఫైనల్​లో కనీసం అర్ధ శతకం కూడా చేయకుండా చివరి వరకు క్రీజులో నిలబడిన ఓపెనర్‌గానూ ఘనత సాధించాడు. 16.43 స్ట్రైక్​ రేట్‌తో బ్యాటింగ్‌ చేసిన చంద్రసింఘే.. ఫస్ట్​ రన్​ చేసేందుకు ఏకంగా 49 బంతులను తీసుకున్న ఆటగాడిగా నిలిచాడు. అలా పలు రికార్డును తన పేరిట రాసుకున్నాడు.

దీంతో చంద్రసింఘే జిడ్డు బ్యాటింగ్​ ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది. కొంతమంది క్రికెట్​ అభిమానులు అతడిని ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. చంద్రసింఘే సహనంగా క్రీజులో ఉండి ఆడిన విధానాన్ని.. టెస్ట్‌ క్రికెట్‌ అభిమానులు కొనియాడుతున్నారు. అతడిని ఆకాశానికెత్తేస్తున్నారు. కాగా, శ్రీలంక మూలాలు ఉన్న చంద్రసింఘే ఆస్ట్రేలియన్​ క్రికెటర్. అతడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్​మెన్​. మైక్‌ హస్సీల, కుమార సంగక్కరను స్ఫూర్తిగా తీసుకుని క్రికెట్​ కెరీర్​ను ఎంచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్​లో 2022లో సౌతాఫ్రికాతో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్​లోనూ సబ్​స్టిట్యూట్​ ఫీల్డర్​గానూ మెరిశాడు. నాథన్ లయన్​ రీప్లేస్​మెంట్​గా జట్టులోకి వచ్చాడు.

ఇకపోతే ఈ షీల్డ్‌ ఫైనల్​లో మూడో రోజు ఆట పూర్తయ్యే సమయానికి విక్టోరియా 2 పరుగుల ముందంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ టీమ్​ 195 పరుగులకు ఆలౌట్‌ అవ్వగా.. రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 122 రన్స్​ వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అంతకుముందు వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగులకు ఆలౌట్​ అయింది.

ఇదీ చూడండి: ధోనీ తన కెరీర్​లో ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేశాడో తెలుసా?

Last Updated : Mar 25, 2023, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.