Ashes 2023 Harry Brook Out : ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను దురదృష్టం వెంటాడుతోంది! ఐపీఎల్ 2023 సీజన్‌లో దారుణంగా విఫలమైన హ్యారీ బ్రూక్.. యాషెస్ సిరీస్‌ను కూడా పేలవ ఆటతీరుతో ప్రారంభించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ విచిత్రకర రీతిలో ఔటయ్యాడు. ఇలా కూడా ఔటవుతారా? ఇదెక్కడి దురదృష్టం అని చెప్పుకునే రీతిలో వెనుదిరిగాడు.
ఏం జరిగిందంటే?
ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ మంచి టచ్‌లో ఉన్నట్లు కన్పించాడు. వరుసగా ఫోర్లు బాది ఆసీస్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. దీంతో బ్రూక్‌ను అపేందుకు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. స్పిన్నర్ నాథన్ లియాన్‌ను బౌలింగ్ ఎటాక్‌లోకి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో 38 ఇన్నింగ్స్ ఓవర్‌లో నాథన్ లియాన్ వేసిన ఆఫ్-బ్రేక్ డెలివరీని.. బ్రూక్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు.
అయితే బంతి థైపాడ్‌కు తాకి కొంచెం గాల్లోకి లేచింది. బంతి ఎటువైపు తెలియక బ్యాటర్ తికమకపడ్డాడు. అయితే చాలా సేపు గాల్లో ఉన్న బంతి కింద పడి బ్రూక్ వెనుక కాలికి తగిలి స్టంప్స్‌ను గిరాటేసింది. ఏం జరిగిందో తెలియక నిరాశతో బ్రూక్ పెవిలియన్‌కు చేరాడు. ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
-
A freak dismissal.
— England Cricket (@englandcricket) June 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Live clips/Scorecard: https://t.co/TZMO0eJDwY pic.twitter.com/cIUQaANJ2x
">A freak dismissal.
— England Cricket (@englandcricket) June 16, 2023
Live clips/Scorecard: https://t.co/TZMO0eJDwY pic.twitter.com/cIUQaANJ2xA freak dismissal.
— England Cricket (@englandcricket) June 16, 2023
Live clips/Scorecard: https://t.co/TZMO0eJDwY pic.twitter.com/cIUQaANJ2x
ఈ ఊహించని ఘటనతో ఒక్కసారిగా బ్రూక్ షాకయ్యాడు. ఆసీస్ ఆటగాళ్లు మాత్రం సంబరాలు చేసుకున్నారు. కామెంటేటర్లు సైతం హ్యారీ బ్రూక్ ఔటైన తీరును చూసి బిత్తెరపోయారు. 'క్రికెట్‌లో ఎన్నో రకాలుగా డిసిమిసల్స్ చూశాను కానీ.. ఇలా ఔటవ్వడం ఎప్పుడూ చూడలేదు' అని రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు. విచిత్రకరమైన ఈ డిసిమిసల్‌పై అభిమానులు కూడా తమదైన శైలిలో జోకులు పేల్చుతున్నారు. 'టైమ్ బాలేకపోతే.. ఇలానే ఉంటుంది రా హ్యారీ బ్రూక్' అంటూ ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. 'ఇదేందయ్యా ఇది.. నేను ఏడ చూడలే' అన్నట్లు పాంటింగ్ కామెంట్స్ ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి 176 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ జాక్ క్రాలీ(61) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. బెన్ డకెట్(12), ఓలీపోప్(31), హ్యారీ బ్రూక్(32), బెన్ స్టోక్స్(1) వెనుదిరగగా.. జోరూట్(45 బ్యాటింగ్), జానీ బెయిర్ స్టో(6 బ్యాటింగ్) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్, జోష్ హజెల్ వుడ్ రెండేసి వికెట్లు తీయగా.. స్కాట్ బోలాండ్ ఓ వికెట్ పడగొట్టాడు.