ETV Bharat / sports

Ashes 2023 : ఇంగ్లాండ్​పై కంగారూల రికార్డుల మోత.. తొలి సీజన్​ నుంచి ఇలా! - పాట్‌ కమిన్స్‌

Australia Records In Ashes Series : ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ సిరీస్​లో ఇంగ్లాండ్​ జట్టు ఆటకట్టించిన ఆసీస్​.. ఇప్పటివరకు పలు రికార్డులను నమోదు చేసింది. అవేంటంటే..

Ashes Series 2023 Australia Records
ఇంగ్లాండ్​కు ముకుతాడు వేసింది.. రికార్డులు నమోదు చేసింది..!
author img

By

Published : Jun 21, 2023, 11:04 AM IST

Updated : Jun 21, 2023, 12:23 PM IST

Australia Records In Ashes Series : ఇంగ్లాండ్​లోని ఎడ్జ్​బాస్ట్​న్​ మైదానం వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక యాషెస్​ సిరీస్​ తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. 'బజ్​బాల్​' సిరీస్​ను​ గెలిచి మంచి జోరు మీదున్న ఇంగ్లాండ్​కు చివరి సెషన్‌లో ఆసీస్​ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, నాథన్‌ లియోన్‌లు వీరోచిత పోరాటం చేసి ముకుతాడు వేశారు. అయితే ఇప్పటి వరకు జరిగిన యాషెస్​ సిరీస్​లో ఆస్ట్రేలియా పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. అవి..

  1. ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్​ గడ్డపై టెస్టుల్లో ఆస్ట్రేలియా 275 అంతకంటే ఎక్కువ లక్ష్యాన్ని ఈ ఏడాదే ఐదుసార్లు ఛేదించగా.. మొత్తంగా ఇది 15వ సారి.
  2. Pat Cummins Nathan Lyon : ఇంగ్లాండ్‌తో జరిగిన తాజా టెస్టులో తొమ్మిదో వికెట్‌కు 55 పరుగులు జోడించింది పాట్‌ కమిన్స్‌- నాథన్‌ లియోన్‌ భాగస్వామ్యం. టెస్టు ఛేజింగ్‌ల్లో తొమ్మిదో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన నాలుగో ద్వయంగా పాట్‌ కమిన్స్‌- నాథన్‌ లియోన్‌ నిలిచారు.
  3. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో కమిన్స్‌ ఐదు సిక్సర్లు కొట్టాడు. దీంతో ఒక టెస్టులో ఎక్కువ సిక్సర్లు బాదిన ఆస్ట్రేలియా సారథుల్లో పాట్‌ కమిన్స్‌ కూడా చోటు దక్కించుకున్నాడు. ఇంతకముందు 2005లో రికీ పాంటింగ్‌ న్యూజిలాండ్‌పై ఐదు సిక్సర్లు తీయగా 1972లో ఇయాన్‌ చాపెల్‌ పాకిస్థాన్‌పై నాలుగు సిక్సర్లతో చెలరేగాడు.
  4. ఆస్ట్రేలియా సారథుల్లో బాబ్‌ సింప్సన్‌ నాలుగుసార్లు, జార్జ్‌ గిఫెన్‌ రెండుసార్లు, వార్విక్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, రిచీ బెర్నాడ్‌, అలెన్‌ బోర్డర్‌ తలా ఒకసారి టెస్టు బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 80 పరుగులతో పాటు బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీసిన తొలి ఐదుస్థానాల్లో ఉన్నారు. ఇక తాజాగా ఆస్ట్రేలియా సారథుల్లో పాట్​ కమిన్స్​ కూడా ఈ ఫీట్​ను అందుకుని ఆరో ఆటగాడిగా ఘనత సాధించాడు.
  5. 1948లో హెడ్డింగేలో 404 పరుగుల టార్గెట్‌ను, అడిలైడ్‌లో 1901-02లో 315 పరుగుల టార్గెట్‌ను, మెల్‌బోర్న్​లో 1928-29లో 286 పరుగుల టార్గెట్‌ను, సిడ్నీ వేదికగా 1897-98లో 275 పరుగుల టార్గెట్‌ను, ఇక తాజాగా ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన టెస్టులో 281 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది ఆసీస్​. కాగా, యాషెస్‌ చరిత్రలోనే అత్యధిక పరుగుల టార్గెట్‌ను చేధించడం ఆస్ట్రేలియాకు ఇది ఐదోసారి.
  6. యాషెస్‌ చరిత్రలో ఇది ఆరో అత్యంత సమీప విజయం. ఇంతకముందు ఇంగ్లాండ్‌ మూడు సందర్భాల్లో ఈ ఫీట్​ను అందుకుంది. ఒకసారి ఒక వికెట్‌ తేడాతో, మరోసారి రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా రెండు సందర్భాల్లో రెండు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.
  7. 1948లో హెడ్డింగేలో ఆస్ట్రేలియా 404 పరుగులు, 1984లో లార్డ్స్‌ వేదికగా వెస్టిండీస్‌ 342 పరుగులు, 2017లో హెడ్డింగే వేదికగా వెస్టిండీస్‌ 322 పరుగులు, ప్రస్తుతం జరిగిన తాజా సిరీస్​ ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా 2008లో దక్షిణాఫ్రికా 281 పరుగుల టార్గెట్‌ను చేధించాయి. అయితే ఇంగ్లాండ్‌ పర్యటనకు వచ్చిన విదేశీ జట్లు అత్యధిక పరుగుల టార్గెట్‌ను చేధించడం ఇది ఐదోసారి.

Last Updated : Jun 21, 2023, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.