లెజెండరీ స్టార్ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ తనయుడు అర్జున్ తెందుల్కర్ ఎట్టకేలకు తండ్రి పేరు నిలబెట్టాడు. రంజీ తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాది తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గోవా తరఫున బరిలోకి దిగిన అర్జున్.. 178 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు.
సచిన్ కూడా.. తన తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ బాదడం విశేషం. 34 ఏళ్ల కిందట.. 1988 రంజీ సీజన్‌లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసిన మాస్టర్.. తన తొలి మ్యాచ్‌లోనే శతకం బాదాడు. తాజాగా అతడి తనయుడు అర్జున్ కూడా తన తొలి రంజీ మ్యాచ్‌లోనే శతక్కొట్టి, తండ్రికి తానే మాత్రం తీసిపోనని చెప్పాడు.
23 ఏళ్ల తెందుల్కర్.. తన దేశవాలీ కెరీర్ ముంబయి తరఫున మొదలు పెట్టినప్పటికీ, అక్కడ పోటీ ఎక్కువగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో గోవాకు షిఫ్ట్ అయ్యాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన అర్జున్ ఇప్పటివరకు 7 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 9 టీ20లు ఆడాడు. ఐపీఎల్ 2022 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్.. ముంబయి ఫ్రాంచైజీలో స్థానం దక్కించుకున్నప్పటికీ, ఇంకా తన తొలి మ్యాచ్ ఆడే అవకాశం మాత్రం దొరకలేదు.
ఇదీ చదవండి: