మూడేళ్ల పాటు సెంచరీ కోసం ఎదురుచూసిన తన అభిమానులకు ఆసియా కప్‌లో దాని రుచి చూపించాడు టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ. ఆ తర్వాత ఆడిన మ్యాచుల్లో ఒక దాంట్లో ఫెయిల్ అయినా.. అనంతరం మళ్లీ బాగా ఆడాడు. తాజాగా హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌తో చెలరేగాడు. దీంతో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ సామ్రాజ్యంలో విరాట్ పరుగుల రారాజు అని కొనియాడాడు. అతడిలో ఉండే స్థిరత్వం ఎనలేనిదని కితాబిచ్చాడు.
"ప్రపంచంలో పేరున్న క్రికెటర్లకు ఉన్న గొప్ప సామర్థ్యం విరాట్‌లో లేకపోవచ్చు. తనకన్నా గొప్పగా ఆడే వారు భారత జట్టులో ఉండివుండవచ్చు. కానీ అతడిలో ఉండే స్థిరత్వం మరెవరీలోనూ లేదు. గతంలో విరాట్ కోహ్లీ రన్స్ తీసి ఔటైతే ఎంఎస్ ధోనీ మిగిలిన ఆటను పూర్తి చేసేవాడు. కానీ ఇప్పుడు అతడి చుట్టూ ఉన్న టీమ్ మారింది. దానివల్ల తనతో పాటు ప్రతిఒక్కరికీ కొత్త బంతులతో ఆడటం తేలికైంది. పటిష్టంగా నిలబడి మ్యాచ్‌ను గెలిపించగల దృఢమైన వ్యక్తి అతడు. పరుగుల వీరుడిగా తనకు దక్కిన గుర్తింపునకు కారణం కేవలం ఆడే సామర్థ్యం మాత్రమే కాదు. అంతకు మించి అతడో స్థిరమైన ఆటగాడు. భారత క్రికెట్‌కు కావలసింది కూడా అదే అని నేను ఆశిస్తాను. ఆటను ఎలా నడిపించాలో కోహ్లీకి తెలుసు" అంటూ ట్వీట్ చేశాడు. ఆసీస్‌తో జరిగి టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి ఆడిన కోహ్లీ.. 48 బంతుల్లో 63 పరుగులు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇదీ చూడండి: IND VS SA: సఫారీతో ఢీ.. జోరు మీదున్న టీమ్ఇండియా.. కానీ అదొక్కటే