ACC Emerging Asia cup 2023 : ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) మెన్స్ ఎమర్జింగ్ కప్ (వన్డే)లో భారత్ యువ జట్టు అదరగొట్టింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ సాయి సుదర్శన్ శతకంతో (110 బంతుల్లో 104 పరుగులు) మెరవడం వల్ల టీమ్ఇండియా 205 పరుగుల లక్ష్యాన్ని 36.4 ఓవర్లలోనే ఛేదించింది. ఈ గెలుపుతో భారత్ ఏ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం టీమ్ఇండియా ఏ, బంగ్లాదేశ్ ఏతో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. సెంచరీతో కదం తొక్కిన సాయి సుదర్శన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
205 పరుగుల ఛేదనలో భారత్ మొదటి నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 20 నిరాశపర్చినా.. మరో ఎండ్‌లో సాయి సుదర్శన్ ఎక్కడా తగ్గలేదు. ఆచి.. తూచి ఆడుతూ వీలుచిక్కినప్పడల్లా బౌండరీలు బాదాడు. అతడికి వన్ డౌన్లో వచ్చిన నికిన్ జోస్ (53)తో కలిసి భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలకంగా మారాడు సుదర్శన్. కాగా లిస్ట్ ఏ కెరీర్లో సుదర్శన్‌కు ఇది నాలుగో శతకం.
పట్టు బిగించిన బౌలర్లు..
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ ఏ జట్టు 9 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. భారత బౌలింగ్ దళం కట్టుదిట్టంగా బంతులు సంధిస్తూ.. పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఫలితంగా ప్రత్యర్థి జట్టును 48 ఓవర్లలో 205 పరుగుల వద్ద ఆలౌట్ చేశారు. మీడియం పేస్ బౌలర్ రాజవర్ధన్ హంగర్గేకర్.. ఏకంగా ఐదు వికెట్లు నేలకూల్చగా.. మరో బౌలర్ మానవ్ సుతార్ మూడు వికెట్లు తీసి పాకిస్థాన్ పతనాన్ని శాసించారు. కాగా ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్, నిషాంత్ సింధు తలో వికెట్ పడగొట్టారు. కాగా పాక్ బ్యాటర్లలో ఖాసిమ్ అక్రమ్ (48) టాప్ స్కోరర్. షాహిబ్జాదా ఫర్హాన్ (35), హషీబుల్లా ఖాన్ (27), ముబసిరర్ ఖాన్ (28), మెహ్రన్ ముంతాజ్ (25) రాణించడం వల్ల పాక్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది.
ఇవీ చదవండి :