ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్, హీరోగా కమల్‌హాసన్(kamal haasan), నిర్మాతగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(sp balasubrahmanyam) రూపొందించిన 'శుభసంకల్పం' సినిమా కోసం పనిచేయడం మర్చిపోలేని అనుభూతి అని నటి ఆమని చెప్పింది. 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి నటి ఇంద్రజతో కలిసి హాజరైన ఈమె పలు ఆసక్తికర విషయాల్ని పంచుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ చిత్రంలో అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టమని ఆమని చెప్పింది. చుట్టూ సీనియర్స్ ఉండేసరికి భయపడిపోయానని తెలిపింది. దీనివల్ల వచ్చిన భయంతోనే ఓ సీన్లో నిజంగానే కమల్‌హాసన్ కొట్టేసినట్లు పేర్కొంది. అప్పుడు కమల్ పక్కకు పిలిచి.. 'కొట్టడం అంటే నిజంగా కొట్టడం కాదమ్మా.. కొట్టినట్లు నటించాలి' అని తనతో చెప్పారని ఆమని వెల్లడించింది.
ఈ సినిమా కోసం మేకప్ వేస్తే, దానిని తొలగించేయమని కెమెరామ్యాన్ పీసీ శ్రీరామ్ తమ అందరితో చెప్పినట్లు ఆమని చెప్పింది. మేకప్ లేకపోతే డీగ్లామర్ కనిపిస్తానేమో అని తాను భయపడినట్లు తెలిపింది. కానీ సినిమా చాలా బాగా వచ్చిందని పేర్కొంది.
![aamani indraja](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12924750_ali-tho-saradaga.png)
తను హీరోయిన్గా మలయాళంలో చేస్తున్న సమయంలో ఓ సినిమా నిర్మాతలు తనతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని ఇంద్రజ చెప్పింది. అయితే వేరే చిత్రాలు చేస్తున్న సమయంలో తమతో సినిమా చేయాలంటూ తనపై ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపింది. ఆ సమయంలో హీరో మమ్ముట్టి(mammootty) కల్పించుకుని, సదరు నిర్మాతలతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించారని ఇంద్రజ(indraja) తెలిపారు. కానీ మీడియా ప్రతినిధులు దీనిని కోర్టు, కేసు అంటూ రాసేశారని స్పష్టం చేసింది.
ఇది చదవండి: South indian actors: ఓటీటీల వైపు స్టార్ హీరోలు..