ETV Bharat / sitara

NET Movie review: 'నెట్' మూవీ.. వలలో పడింది ఎవరు? - telugu movie latest review

తెలుగులో వచ్చిన భిన్న ప్రయత్నం 'నెట్'. టెక్నో థ్రిల్లర్ కథతో తీసిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలైంది. మరి ఎలా ఉంది? దీని కథేంటి? తదితర సంగతుల కోసం ఈ రివ్యూ చదివేయండి.

NET movie review in telugu
నెట్ మూవీ రివ్యూ
author img

By

Published : Sep 13, 2021, 5:31 PM IST

చిత్రం: నెట్‌; నటీనటులు: రాహుల్‌ రామకృష్ణ, అవికా గోర్‌, ప్రణీత పట్నాయక్‌, విశ్వదేవ్‌ తదితరులు; సంగీతం: నరేశ్‌ కుమారన్‌; నిర్మాత: సూర్య రాహుల్‌ తమడ, సాయిదీప్‌ రెడ్డి బొర్రా; కథ, దర్శకత్వం: భార్గవ్‌ మాచర్ల; విడుదల: జీ5

సరికొత్త కథలు, కాన్సెప్ట్‌లతో యువ దర్శకులు మంచి సినిమాలు తీస్తున్నారు. చిన్న పాయింట్‌ను ఎంచుకుని, దాని చుట్టూ అలరించే కథ, కథనాలను అల్లుకుంటూ సినిమాలో ప్రేక్షకుడిని లీనం చేస్తున్నారు. అలాంటి కథే 'నెట్‌'. ప్రస్తుతం యువతకు కనెక్ట్‌ అయ్యే ఈ సినిమా ఎలా ఉంది? రాహుల్‌ రామకృష్ణ, అవికా గోర్‌ ఎలా నటించారు? 'నెట్‌'లో పడిందెవరు?

NET movie review in telugu
నెట్ మూవీ రివ్యూ

కథేంటంటే: రాహుల్‌ రామకృష్ణ(లక్ష్మణ్‌) నల్గొండలో మొబైల్‌ఫోన్‌ షాప్‌ను నిర్వహిస్తుంటాడు. అశ్లీల చిత్రాలకు బానిస. బాగా చదువుకున్న, స్టైల్‌గా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ, తన తండ్రి మాట కాదనలేక వెంకట లక్ష్మిని(ప్రణీత పట్నాయక్‌) వివాహం చేసుకుంటాడు. ఇంట్లో భార్య ఉన్నా, పక్కింటి మేడపై కనిపించే అమ్మాయిలనే చూస్తుంటాడు. ఇక ఎప్పుడూ మొబైల్‌లో అశ్లీల చిత్రాల గురించే శోధన. ఈ క్రమంలో వివిధ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్స్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లను లైవ్‌లో చూపించే ఓ వెబ్‌సైట్‌ను చూస్తాడు. అందులో ఒక ఫ్లాట్‌ను ఎంచుకోగా, అక్కడ ప్రియ(అవికా గోర్‌), ఆమెకు కాబోయే భర్త రంజిత్‌(విశ్వజిత్‌) నివసిస్తుంటారు. అప్పటినుంచి రోజూ ఆ ఇంట్లో జరిగే తంతును లక్ష్మణ్‌ చూస్తుంటాడు. ఈ క్రమంలో లక్ష్మణ్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? సీక్రెట్‌ కెమెరాల ద్వారా ప్రియ ప్రైవేట్‌ లైఫ్‌ వీక్షించిన రాహుల్‌ చిక్కుల్లో పడటానికి కారణమేమిటి? ప్రియ జీవితాన్ని సీక్రెట్‌ కెమెరాలతో చిత్రీకరించింది ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: 'నెట్‌' ఒక టెక్నో థ్రిల్లర్‌. తెలుగులో ఇలాంటి సినిమాలు అరుదు. ఎందుకంటే 'నెట్‌'లాంటి కథలను డీల్‌ చేయడం కత్తిమీద సాములాంటిది. ఈ విషయంలో దర్శకుడు భార్గవ్‌ మాచర్ల పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం సమాజంలో జరిగే సైబర్‌ నేరాలకు లెక్కలేదు. మనుషుల వీక్‌నెస్‌లతో ఆడుకుంటూ నేరస్థులు ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. అశ్లీల చిత్రాలు, ఇతరుల వ్యక్తిగత జీవితాలను చూడాలని ఉబలాటపడే ఒక వ్యక్తి వాటికి బానిసై ఎలాంటి ఇబ్బందులు పడ్డాడన్నదే ఈ కథ. లక్ష్మణ్‌ వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ కథను మొదలు పెట్టాడు దర్శకుడు. లక్ష్మణ్‌ను అతడి భార్య ఎంతగానో ప్రేమిస్తుంది. కానీ, లక్ష్మణ్‌ మాత్రం ఇతర మహిళల పట్ల ఆకర్షితుడవుతుంటాడు.

NET movie review in telugu
నెట్ మూవీ రివ్యూ

సీసీటీవీల్లో ప్రియ వ్యక్తిగత జీవితాన్ని చూడటం మొదలు పెట్టడం వల్ల కథ కీలక మలుపు తిరుగుతుంది. ప్రియ ఇంట్లో ఉన్న ఒక్కో కెమెరాను చూడాలంటే దానికి నిర్దేశిత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. లక్ష్మణ్‌ వాటికి డబ్బులు చెల్లిస్తూ వెళ్లడం చూస్తుంటే చెడుకు మనిషి ఎంత త్వరగా అలవాటు పడతాడోన్న విషయం అర్థమవుతుంది. అయితే, ప్రియ ఇంట్లో జరిగే విషయాలను లక్ష్మణ్‌ తన ఫోన్‌లో చూస్తుండటం, ఒక్కో కెమెరాకు డబ్బులు చెల్లిస్తూ వెళ్లడం ఇదంతా కాస్త సాగదీతగా, చూసిన సన్నివేశమే చూశామా? అన్నభావన కలుగుతుంది. ద్వితీయార్ధం నుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది. ప్రియకు కాబోయే భర్త రంజిత్‌లో ఉన్న మరో కోణం తెలుసుకున్న లక్ష్మణ్‌ ఈ విషయాన్ని ఆమెకు చెప్పేందుకు ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఆయా సన్నివేశాలు కాస్త ఆసక్తిగా అనిపిస్తాయి. చివరకు ప్రియ తన ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను ఎలా కనిపెట్టిందన్నది మాత్రం తెరపైనే చూడాలి. మొదటి నుంచి ఉత్కంఠను బిల్డ్‌ చేసుకుంటూ వచ్చిన దర్శకుడు పతాక సన్నివేశాలను తేల్చేశాడు. కొత్త కథలను ఇష్టపడేవారు 'నెట్‌' చూడొచ్చు. అయితే, ఫ్యామిలీతో కూర్చొని చూడాలంటే కాస్త ఇబ్బందే. ఓటీటీ కావడం వల్ల అక్కడక్కడా బూతులు యథేచ్చగా వదిలేశారు.

ఎవరెలా చేశారంటే: నటుడిగా, కమెడియన్‌గా రాహుల్‌ రామకృష్ణ అందరికీ సుపరిచితమే. 'నెట్‌'లో మరో కొత్త రామకృష్ణను తెరపై చూడొచ్చు. భార్యతో గొడవపడే సన్నివేశాలు, అశ్లీల చిత్రాలకు బానిసైన వ్యక్తిగా రాహుల్‌ హావభావాలతో మెప్పించాడు. ద్వితీయార్ధం, పతాక సన్నివేశాల్లో రాహుల్‌ నటన హైలైట్‌. మధ్య తరగతి మహిళగా, భర్త నుంచి ప్రేమను కోరుకునే భార్య ప్రణీత మంచి నటన కనబరిచింది. రాహుల్‌తో సమానంగా అవికా గోర్‌ కూడా తెరపై కనిపిస్తుంది. తను కూడా ఓకే. విశ్వజిత్‌, విష్ణు తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సాంకేతికంగా సినిమా బాగుంది. నరేశ్‌ కుమారన్‌ నేపథ్య సంగీతం, అబ్బరాజు నాయర్‌ సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్‌ చాలా బాగా కుదిరాయి. భారవ్‌ మాచర్ల ఎంచుకున్న పాయింట్‌ కొత్తది. దాన్ని అంతే కొత్తదనంతో చూపించే ప్రయత్నం చేశారు. మొదటి నుంచి థ్రిల్లింగ్‌గా కథ, కథనాలను నడిపిన దర్శకుడు చివరిలో తేల్చేశాడేమో అనిపిస్తుంది.

బలాలు

+ దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌

+ రాహుల్‌ రామకృష్ణ

+ సాంకేతిక బృందం పనితీరు

బలహీనతలు

- పతాక సన్నివేశాలు

- అక్కడక్కడా సాగదీతగా అనిపించే సన్నివేశాలు

చివరిగా: థ్రిల్లింగ్‌ పంచే నెట్‌.. క్లైమాక్స్‌ ఫట్‌..

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.