ETV Bharat / sitara

అల్లు అర్జున్ 'పుష్ప'.. ఎందుకంత స్పెషల్? - ఫహాద్ ఫాజిల్ పుష్ప

Pushpa movie: ''పుష్ప'.. పుష్పరాజ్ నీ అవ్వా తగ్గేదేలే' అంటూ థియేటర్లలోకి వచ్చిన బన్నీ.. ఈ సినిమాతో చాలా ప్రయోగాలే చేశారు. అలానే ఈ చిత్రంలో చాలా విశేషాలు కూడా ఉన్నాయి. ఇంతకీ అవేంటి? దాని సంగతేంటి?

allu arjun pushpa movie
అల్లు అర్జున్ పుష్ప
author img

By

Published : Dec 17, 2021, 5:31 AM IST

Allu arjun pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప'.. ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఈ సినిమా ఎలా ఉండనుంది? పుష్పరాజ్​గా బన్నీ ఎలా చేశారు? సుక్కు మార్క్​ డైరెక్షన్.. ఈ చిత్రంలో ఎలా చూపించారు? ఇలా అభిమానుల్లో చాలా సందేహాలు. వీటిన్నింటికి కొంతమేర సమాధానం చెబుతూ పోస్టర్లు, పాటలు, ట్రైలర్​ వచ్చేశాయి. సినిమా రిలీజైన సందర్భంగా 'పుష్ప' గురించి మరికొన్ని విశేషాలు మీకోసం.

allu arjun pushpa review
పుష్ప సినిమాలో అల్లు అర్జున్

*అన్నింటికంటే మొదటి చెప్పుకోవాల్సిన విషయం అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్​. వీరిద్దరూ గతంలో 'ఆర్య', 'ఆర్య 2' సినిమాలు చేశారు. అవి రెండూ ప్రేమకథలే.

*ఇప్పుడు తీస్తున్న హ్యాట్రిక్ మూవీ 'పుష్ప' మాత్రం అడవి బ్యాక్​డ్రాప్​లో తీసిన మాస్ ఎంటర్​టైనర్​. దీనిని కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండటం విశేషం.

allu arjun rashmika
అల్లుఅర్జున్ రష్మిక

*ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో స్టైలిష్​గా, హ్యాండ్సమ్​గా కనిపించిన బన్నీ.. 'పుష్ప'తో సాహసం చేశారు! లారీ డ్రైవర్​, డాన్​గా.. కెరీర్​లో ఎప్పుడూ చేయని పాత్రల్లో తొలిసారి కనిపించబోతున్నారు.

*ఈ సినిమాలో అల్లు అర్జున్.. భుజం పైకెత్తి సరికొత్త మేనరిజమ్​తో కనిపించనున్నారు. తొలుత అందరూ దానిని పాత్రకు ఉన్న సమస్య అని అనుకున్నారు. కానీ తర్వాత బన్నీనే ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు.

*'రంగస్థలం' సినిమాతో తొలిసారి విలేజ్​ బ్యాక్​డ్రాప్​ కథ చేసిన డైరెక్టర్ సుకుమార్.. బ్లాక్​బస్టర్​ హిట్​ కొట్టారు. తద్వారా తన బలం తెలుసుకున్న సుక్కూ.. దాదాపు అలాంటి నేపథ్యంతోనే 'పుష్ప' తెరకెక్కించడం విశేషం.

allu arjun sukumar
అల్లుఅర్జున్ సుకుమార్

*ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో హీరోయిన్​గా మాత్రమే చేసిన సమంత.. కెరీర్​లో తొలిసారి 'పుష్ప' కోసం స్పెషల్ సాంగ్ చేసింది. యూట్యూబ్​లో, సోషల్ మీడియాలో ఈ పాట చేస్తున్న సందడి ఏంటో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'ఊ అంటవా ఊహు అంటవా' అనే లిరిక్స్​ అయితే కుర్రాళ్లు అస్సలు కుదురుగా కూర్చొనివ్వట్లేదు. అంతలా ఫేమస్​ అయిందీ గీతం.

samantha pushpa item song
సమంత ఐటమ్ సాంగ్

*ఈ సినిమా మొత్తం చిత్తూరు చంద్రగిరి నేపథ్యంగా సాగనున్నట్లు తెలుస్తోంది. దీంతో నటీనటులు అందరూ చిత్రం ప్రారంభం కావడానికి ముందే ఆ యాసను నెలల పాటు ప్రాక్టీసు చేసి మరీ షూటింగ్​కు హాజరయ్యారు!

*మలయాళ విలక్షణ నటుడు ఫహాద్​ ఫాజిల్​ చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇది. ఇందులో భన్వర్ సింగ్ షెకావత్​ అనే పోలీస్​ అధికారిగా ఆయన కనిపించనున్నారు. 'పుష్ప' తొలి భాగం ఆయన కొద్ది నిమిషాలే కనిపిస్తారని, రెండో భాగంలో మాత్రం పూర్తి నిడివి ఉన్న పాత్రలో అలరిస్తారని తెలుస్తోంది.

fahadh faasil in pushpa
ఫహాద్ ఫాజిల్

*అల్లు అర్జున్​ గత చిత్రాలు చాలావరకు ఉత్తరాదిలో డబ్ అయ్యాయి. యూట్యూబ్​లో అవి ఒక్కొక్కటి వందల మిలియన్స్ వ్యూస్ సాధిస్తూ బన్నీకి ఎక్కడలేని క్రేజ్​ తీసుకొచ్చాయి. మరి ఇప్పుడు 'పుష్ప' లాంటి పాన్ ఇండియా సినిమాతో తొలిసారి అల్లుఅర్జున్ అక్కడి ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. మరి చూడాలి ఎలాంటి రికార్డులు నమోదవుతాయో?

*శేషాచలం ఎర్రచందనం, దాని స్మగ్లింగ్​ గురించి ఇప్పటికే మనం చాలాసార్లు వార్తల్లో విన్నాం. కానీ దాని నేపథ్య కథతో వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.

*డిసెంబరు 17న పాన్ ఇండియా రేంజ్​లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

pushpa allu arjun stills
అల్లు అర్జున్ పుష్ప స్టిల్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.