Vijay Deverakonda New Look: 'అర్జున్‌రెడ్డి', 'గీతాగోవిందం' సినిమాలతో యువతకు దగ్గరైన యువహీరో విజయ్ దేవరకొండ కొత్త లుక్‌లో కనిపించాడు. 'లైగర్' చిత్రంలోని తన బాక్సర్ లుక్ కోసం దాదాపు రెండేళ్లు పాటు పొడవాటి జుట్టును మెయింటైన్ చేసిన విజయ్.. ఆ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత తన జట్టును కత్తిరించినట్లు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్లో విజయ్ షార్ట్ హెయిర్‌తో కనిపించాడు. ఆ కార్యక్రమంలో విజయ్ ఫొటోను ఎవరో క్లిక్‌మనిపించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా.. వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో విజయ్ షార్ట్ హెయిర్‌తో స్టైలిష్‌గా, కూల్‌గా, తలపై క్యాప్‌తో హ్యాండసమ్గా కనిపిస్తున్నాడు.
ప్రైమ్ వాలీబాల్ లీగ్ కోసం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో విజయ్ కొత్త లుక్‌తో కనిపించాడు. ఇప్పటికే విజయ్-పూరీ జగన్నాథ్ కాంబోలో 'లైగర్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. వీరిద్దరి కాంబినేషన్లో 'జన గణ మన' తెరపైకెక్కించనున్నట్లు పూరీ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా చిత్రీకరణ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్ సైనికాధికారిగా కనిపించనున్నట్లు సమాచారం. అందుకోసమే విజయ్ కొత్త హెయిర్‌స్టైల్ చేయించుకున్నట్లు తెలుస్తోంది.
కాగా విజయ్ నటించిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'లైగర్' ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకురానుంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రముఖ బాక్సర్ మైక్‌టైసన్ కీలక పాత్ర పోషించారు. విజయ్ సరసన అనన్య పాండే సందడి చేయనుంది.
ఇదీ చూడండి: ట్రైలర్స్‌తో సెబాస్టియన్, మారన్.. రిలీజ్ డేట్‌తో తాప్సీ