సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు మీడియా సర్కస్‌గా మారిపోవడం దురదృష్టకరమని బాలీవుడ్ నటి విద్యాబాలన్ మంగళవారం తెలిపింది. రియా చక్రవర్తిపై వస్తున్న వార్తా కథనాలపైనా విమర్శించింది. ఇటీవలే టాలీవుడ్ నటి మంచు లక్ష్మి ట్విట్టర్ వేదికగా రియాపై స్పందించింది. సుశాంత్, రియా ఇద్దరికీ న్యాయం చేయాలని కోరింది. ఈ క్రమంలోనే లక్ష్మి అభిప్రాయాలతో అంగీకరిస్తూ.. విద్యాబాలన్‌తో పాటు నటి తాప్సీ కూడా రీట్వీట్ చేసింది.
"ఈ విషయంలో మనసులో మాట చెప్పావు మంచు లక్ష్మి. గాడ్ బ్లెస్ యూ. సుశాంత్ సింగ్ విషాద ఘటన మీడియా సర్కస్‌గా మారడం చాలా దురదృష్టకరం. అదే క్రమంలో రియా చక్రవర్తిపై లేనిపోని అబాండాలు వేయడం చూసి నా మనసు విరిగిపోయింది. ఒకరు నిర్దోషిగా నిరూపించుకునే వరకు దోషిగా నిలబడాల్సిందేనా. ఒక్కసారైనా రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులపై గౌరవం కలిగి ఉందాం."
-విద్యాబాలన్, సినీ నటి
మంచు లక్ష్మి పోస్టుకు అనేక మంది తారలు మద్దతుగా నిలిచారు. అయితే, సుశాంత్ మేనకోడలు మల్లికా సింగ్ లక్ష్మి అభిప్రాయాలను ఖండించింది. సహచరులకు మద్దతుగా నిలబడటాన్ని అకస్మాత్తుగా గుర్తుచేసుకోవడం తనకు ఆశ్చర్యంగా ఉందని మల్లికా పేర్కొంది.
-
@LakshmiManchu pic.twitter.com/GnjPpsyoaq
— vidya balan (@vidya_balan) September 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">@LakshmiManchu pic.twitter.com/GnjPpsyoaq
— vidya balan (@vidya_balan) September 1, 2020@LakshmiManchu pic.twitter.com/GnjPpsyoaq
— vidya balan (@vidya_balan) September 1, 2020