ETV Bharat / sitara

ముచ్చటగా మూడోసారి ఆ దర్శకుడితో త్రిష! - గౌతమ్​ మీనన్​ తెరకెక్కించబోయే లఘుచిత్రంలో త్రిష

దర్శకుడు గౌతమ్ వాసుదేవ్‌ ​ మీనన్​ తెరకెక్కించబోయే లఘుచిత్రంలో త్రిష నటించనుందని టాక్​. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియన్‌ సెల్వన్‌' చిత్రంలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

Trisha and Gautham Menon join hands for a lockdown video. Watch sneak peek
మూడోసారి ముచ్చటగా ఆ దర్శకుడుతో త్రిష!
author img

By

Published : May 4, 2020, 8:11 AM IST

గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వంలో త్రిష నటిస్తుందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. గౌతమ్‌ ఓ లఘు చిత్రం తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నడని సమాచారం. ప్రధాన పాత్ర కోసం త్రిషను ఎంపిక చేశారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

గతంలో గౌతమ్‌ దర్శకత్వంలో వచ్చిన రెండు చిత్రాల్లో నటించింది త్రిష. 'విన్నైతాండి వరువాయ', 'ఎన్నై అరిన్‌దల్‌' సినిమాలు ఘన విజయం అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటం వల్ల అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడుగా తెరకెక్కిస్తున్న 'ఆచార్య' నుంచి ఇటీవల త్రిష తప్పుకుంది. మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియన్‌ సెల్వన్‌' చిత్రంలో నటిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.