ETV Bharat / sitara

విషాద చిత్రం.. అస్తమించిన 'ఉదయ కిరణం'

వరుసగా మూడు హిట్లు.. అతిచిన్న వయసులోనే ఉత్తమ నటుడిగా ఫిల్మ్​ఫేర్ పురస్కారం.. లవర్ బాయ్ ఇమేజ్.. ఇన్ని సంపాదించుకుని తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన హీరో ఉదయ్​ కిరణ్​ 33 ఏళ్లకే కన్నుమూశాడు. నేడు (జూన్​ 26) ఉదయ్​ కిరణ్ జయంతి సందర్భంగా అతని జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

Tollywood Hero Uday Kiran Birth Anniversary Special Story
చిత్రసీమలో అస్తమించినా..ఎప్పటికీ ఉదయించే కిరణమే!
author img

By

Published : Jun 26, 2020, 5:32 AM IST

Updated : Jun 26, 2020, 6:21 AM IST

"మీ పెద్దోళ్లున్నారే.. మా చిన్నోళ్లకు ఏం కావాలో ఎప్పటికీ తెలుసుకోలేరు" అంటూ భిన్నమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేశాడు హీరో ఉదయ్ కిరణ్. వరుసగా మూడు భారీ విజయాలు అందుకుని లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఈ హీరో (జూన్​ 26) 40వ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా అతడి గురించి పలు విశేషాలు మీకోసం.

Tollywood Hero Uday Kiran Birth Anniversary Special Story
ఉదయ్​ కిరణ్​

బ్యాక్​గ్రౌండ్..

1980 జూన్ 26న హైదరాబాద్​లో జన్మించాడు ఉదయ్ కిరణ్. సికింద్రాబాద్​ వెస్లీ కాలేజ్​లో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం మోడలింగ్ మొదలుపెట్టి సినిమాలపై మక్కువతో చిత్రసీమలో అడుగుపెట్టాడు. 2014లో విషితను వివాహం చేసుకున్నాడు.

సినీ ప్రస్థానం..

ఉషాకిరణ్ మూవీస్ సంస్థ నిర్మాణంలో తేజ దర్శకత్వం వహించిన 'చిత్రం' సినిమాతో తెరంగేట్రం చేశాడు ఉదయ్. రెండో సినిమా 'నువ్వు-నేను'.. తేజ దర్శకత్వంలోనే నటించాడు. ఆ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్​ఫేర్​ అవార్డు అందుకున్నాడు. అనంతరం 'మనసంతా నువ్వే' చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. 'కలుసుకోవాలని', 'నీ స్నేహం', 'శ్రీరామ్​' లాంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

21 ఏళ్లకే ఫిల్మ్​ఫేర్ అవార్డు..

నువ్వు-నేను చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్​ఫేర్ అవార్డు దక్కించుకున్నాడు. అతి చిన్న వయసులో(21 ఏళ్లు) ఈ పురస్కారం అందుకున్న హీరోగా ఘనత సాధించాడు. ఇప్పటికీ అతడి పేరు మీదే ఈ రికార్డు ఉంది.

వైఫల్యాలతో సతమతం..

వరుస విజయాలతో దూసుకెళ్లిన ఉదయ్ కిరణ్​ను తర్వాత పరాజయాలే పలకరించాయి. 2002లో విడుదలైన 'నీ స్నేహం' చిత్రమే ఉదయ్ కెరీర్​లో చివరి విజయం. తెలుగుతో పాటు తమిళంలోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. 'పొయ్‌', 'వాంబు శాండై', 'పెన్‌ సింగమ్‌' లాంటి చిత్రాల్లో నటించాడు. అయినా విజయాలు అంతంతమాత్రమే.

మరణం..

వరుస ఫ్లాఫ్​లు, ఆర్థిక ఇబ్బందులతో మానసిక ఒత్తిడికిలోనై 2014 జనవరి 5న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయ్ కిరణ్ మరణం చిత్రసీమలో, అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎంతో ఎత్తుకు ఎదుగుతాడనుకున్న ఉదయ్‌కిరణ్‌ 33 ఏళ్ల వయసులోనే తనువు చాలించాడు.

ఇదీ చూడండి... స్నేహితుడి గురించి ప్రియా వారియర్ భావోద్వేగ పోస్టు

Last Updated : Jun 26, 2020, 6:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.