టాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ప్రముఖ డైరక్టర్ రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్కు విరామం ప్రకటించారు.
రాజమౌళి వ్యక్తిగత పనిపై అమెరికా వెళ్లిన కారణంగా ఒక వారం రోజులు చిత్రీకరణ ఆపివేసినట్లు ఆ చిత్ర నిర్మాతలు తెలిపారు. చరణ్, తారక్ ఈ మూవీ షూటింగ్ సమయంలో గాయాలపాలయ్యారు. ప్రస్తుతం కోలుకున్న ఇద్దరు నటులు కొద్దిరోజులగా కీలకమైన యుద్ధ సన్నివేశాలలో పాల్గొన్నారు.
ఈ చిత్రంలో చరణ్ సరసన నటిస్తున్న ఆలియా భట్, మరో కీలక పాత్రలో కనిపించనున్న అజయ్ దేవగణ్ త్వరలోనే ఈ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2020 జులై 30న విడుదల కానుందీ సినిమా.
ఇవీ చూడండి.. 'నువ్వు ఆడుకున్నది నాతో కాదు.. యముడితో'