ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్', 'పుష్ప' టీమ్స్ మాస్టర్ ప్లాన్.. ఆ దేశంలో ఈవెంట్స్! - తెలుగు మూవీస్ దుబాయ్ పబ్లిసిటీ

టాలీవుడ్​కు దుబాయ్​ పబ్లిసిటీ హబ్​గా మారనుంది. భారీ బడ్జెట్​ సినిమాలైన ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రాల ఈవెంట్స్​ను ఆ దేశంలోనే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

telugu movies Publicity In Dubai
మూవీ న్యూస్
author img

By

Published : Nov 11, 2021, 7:44 PM IST

మన వరకు మాత్రమే పరిమితమైన తెలుగు సినిమా.. గత కొన్నేళ్ల నుంచి పాన్ ఇండియా స్థాయిలో అభిమానుల్ని అలరిస్తోంది. అందుకు తగ్గట్లే పబ్లిసిటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆ రేంజ్ కూడా పెంచేస్తున్నారు. ఏకంగా విదేశాల్లో ఈవెంట్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప' చిత్రబృందాలు రెడీ అవుతున్నాయి!

దక్షిణాది సినిమాలకు ఇటీవల కాలంలో దుబాయ్ ప్రమోషనల్​ హబ్​గా మారింది. గతంలో హిందీ చిత్రాల ప్రచారం అక్కడ జరగ్గా.. రజనీకాంత్ 'రోబో'తో అక్కడ దక్షిణాది సినిమాల ప్రచారం మొదలైంది. దుల్కర్ సల్మాన్ 'కురుప్' ట్రైలర్​ను ఇప్పుడు అత్యంత ఎత్తయిన బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించి, సరికొత్త ట్రెండ్​ సెట్ చేశారు.

RRR movie ram charan ntr
ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్​చరణ్, ఎన్టీఆర్

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక ఈవెంట్​ను దుబాయ్​లోనే నిర్వహించనున్నారు. త్వరలో దీని గురించి ప్రకటన వచ్చే అవకాశముంది. జనవరి 7న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

అల్లు అర్జున్ 'పుష్ప' టీమ్ దృష్టి కూడా దుబాయ్​పైనే పడిందట! త్వరలో ఆ దేశంలో పబ్లిసిటీ ఈవెంట్​ను పెట్టాలని భావిస్తున్నారు. మలయాళీలు ఎక్కువగా ఉండే ఆ దేశంలో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తే.. చాలామందికి రీచ్​ అయ్యే అవకాశముందనే ఆలోచనతో చిత్రబృందం ఉంది. ఈ సినిమా డిసెంబరు 17న ప్రేక్షకులను పలకరించనుంది.

Allu arjun Pushpa movie
పుష్ప సినిమాలో అల్లు అర్జున్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.