ప్రముఖ నటుడు చిరంజీవి నివాసంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ గురువారం ఉదయం సమావేశమయ్యారు. చిరంజీవి, నాగార్జునతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్‌బాబు, సి.కల్యాణ్, దిల్‌రాజు, జెమిని కిరణ్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, దర్శకుడు రాజమౌళి, వి.వి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్.శంకర్, కొరటాల శివ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
అనంతరం మాట్లాడిన తలసాని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ప్రభుత్వం తక్షణమే అనుమతిస్తుందని తెలిపారు. మిగిలిన విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. సినీ కార్మికులకు ఇప్పటికే చిరంజీవి నేతృత్వంలోని సీసీసీ ఆదుకుంటోందని.. ప్రభుత్వం కూడా అందుకు తోడ్పాటునందించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.