బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ చివరి సినిమా 'దిల్ బెచారా' ట్రైలర్ విడుదలైంది. ఇటీవలే ఈ నటుడు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. దీంతో ఈ చిత్రాన్ని చూసేందుకు అభిమానులు చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. జులై 24 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఇది స్ట్రీమింగ్ కానుంది.
2014లో వచ్చిన హాలీవుడ్ రొమాంటిక్ డ్రామా 'ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్' ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో సుశాంత్ సరసన సంజనా సంఘీ నటించింది. సారా అలీ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనుంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ముఖేశ్ చబ్రా.. ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">