బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది. తాజాగా నటుడి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి రియా చక్రవర్తి సోదరుడు షోయిక్ చక్రవర్తిని రెండోసారి అధికారులు విచారించారు.
శనివారం మధ్యాహ్నం ఈడీ కార్యాలయానికి వెళ్లిన షోయిక్.. దాదాపు 18 గంటల తర్వాత ఆదివారం ఉదయం 7గంటలకు బయటకు వచ్చాడు. అయితే ఈడీ ప్రశ్నలకు షోయిక్ సరైన సమాధానలు చెప్పడం లేదని అధికారులు తెలిపారు. కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోందని అన్నారు. ఈ క్రమంలోనే సోమవారం మళ్లీ పిలిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రియాను కూడా సోమవారం మరోసారి విచారించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదే కేసులో శుక్రవారం సుమారు 8 గంటల పాటు రియాను ఈడీ ప్రశ్నించింది. ఆమె చార్టర్డ్ అకౌంటెంట్ రితేశ్ షా, మాజీ మేనేజర్ శ్రుతి మోదీలనూ చాలాసేపు విచారించింది. సుశాంత్ తండ్రి కృష్ణ కిశోర్ సింగ్ పట్నా పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు.. మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.
ఇదీ చూడండి:సుశాంత్ కేసులో ఈడీ దర్యాప్తు సాగిందిలా!