ETV Bharat / sitara

ఉపగ్రహానికి హీరో పునీత్ పేరు- ప్రభుత్వ బడి విద్యార్థులే రూపకర్తలు! - పునీత్​ రాజ్​ కుమార్​ శాటిలైట్​​

Puneeth Rajkumar Satellite: కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్​కుమార్​ పేరుతో ఓ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ శాటిలైట్​ను రూపొందించడం మరో విశేషం.

Puneeth Rajkumar satellite
Puneeth Rajkumar satellite
author img

By

Published : Feb 28, 2022, 8:05 PM IST

Puneeth Rajkumar Satellite: భారత దేశ చరిత్రలో తొలిసారి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఓ ఉపగ్రహాన్ని రూపొందించనున్నారు. 2021 అక్టోబర్ 29న కన్నుమూసిన కన్నడ దిగ్గజ నటుడు పునీత్​ రాజ్​కుమార్​ పేరుతో ఈ శాటిలైట్​ను నింగిలోకి పంపనున్నారు. కర్ణాటకలోని 20 సర్కారీ పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశం దక్కించుకున్నారు.

ఇస్రో సహకారంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతోంది. ఇందుకోసం ఇప్పటికే ఓ పోటీ నిర్వహించింది. 20 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 100 మంది విద్యార్థులతో ఈ ప్రాజెక్టు చేపడుతోంది. జాతీయ సైన్స్ దినం సందర్భంగా బెంగళూరులోని మల్లేశ్వరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి అశ్వథ్ నారాయణ ఈ విషయం వెల్లడించారు.

"ఇస్రో సాయంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రూపొందించే ఉపగ్రహాన్ని ప్రయోగించాలని నిర్ణయించాం. ఇందుకు రూ.1.90 కోట్లు ఖర్చు అవుతాయి. సాధారణంగా 60 కిలోల ఉపగ్రహం తయారీకి రూ.50-60కోట్లు అవసరం. కానీ మేము కిలోన్నర బరువుతోనే ఉపగ్రహాన్ని చేయిస్తున్నాం. పునీత్​ రాజ్​కుమార్​కు పిల్లలు అంటే చాలా ఇష్టం. అలాగే పిల్లలకు పునీత్​ అంటే ఎంతో అభిమానం. అందుకే ఈ శాటిలైట్​కు ఆయన పేరు పెడుతున్నాం" అని తెలిపారు నారాయణ.

కేంద్ర మాజీ మంత్రి సదానంద గౌడ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. "భారత్​ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా యువతను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. మనకు తెలియని ఎన్నో విషయాలను ఇప్పటికే విద్యార్థులు చేసి చూపించారు" అని ఆయన అన్నారు.

ఇదీ చూడండి: కూల్​ లుక్​లో రౌడీ హీరో.. ఆ సినిమా కోసమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.