Shivashankar master Alitho saradaga: కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో పోరాడుతూ ఆదివారం కన్నుమూశారు. సినీ పరిశ్రమకు ఆయన సేవలు మరవలేనివని పలువురు ప్రముఖులు వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని ఆయన పంచుకున్న కొన్ని విషయాలు మీకోసం..
వెన్నముక విరిగింది..
"మా ఇల్లు చాలా పెద్దది. నాకు ఏడాదిన్నర వయసున్నప్పుడు మా పెద్దమ్మ నన్ను ఒడిలో కూర్చోబెట్టుకుని అరుగు మీద కూర్చుని పొరిగింటివారితో కబుర్లు చెప్పేది. ఓరోజు అలా కూర్చున్న సమయంలో అనుకోకుండా ఓ ఆవు.. వారి వైపుగా పరుగులు తీసింది. దీంతో ఎక్కడ ఆవు తన మీదకు వస్తుందోనని మా పెద్దమ్మ ఇంట్లోకి పరుగెత్తింది. అప్పుడు నేను తన చేతుల్లోనుంచి గుమ్మం మీద పడిపోయా. వెన్నముక విరిగిపోయింది. నెల రోజుల పాటు జ్వరం తగ్గలేదు. ఏ ఆసుపత్రిలో చూపించినా నయం కాలేదు," అని శివశంకర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.
చివరగా అలా..
విదేశాల్లో డాక్టర్‌గా చేసి మద్రాసులో స్థిరపడిన నరహింస అయ్యర్ ఆయనకు వైద్యం చేసి, వెన్నముక సరిచేసినట్లు శివశంకర్ మాస్టర్ చెప్పారు. ఆ సమయంలో.. 'ఈ పిల్లాడిని ఎవ్వరి దగ్గరికి తీసుకెళ్లొద్దు, నా దగ్గరికి తీసుకొస్తే మళ్లీ నడిచేలా చేస్తా' అని డాక్టర్ అయ్యర్ తన తల్లిదండ్రులకు హామీ ఇచ్చినట్లు మాస్టర్ తెలిపారు. 8 ఏళ్ల పాటు వైద్యం చేశాక ఆయన కోలుకున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత డ్యాన్స్‌పై విపరీతంగా ఇష్టం పెరిగినట్లు శివశంకర్ మాస్టర్ చెప్పారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: