ETV Bharat / sitara

RRR: 'దోస్తీ' పాట వచ్చేస్తోంది.. సిద్ధంకండి - Ramcharan RRR Dosthi song

రామ్ చరణ్, తారక్ హీరోలుగా జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ ప్రాజెక్ట్​' ఆర్ఆర్ఆర్'. అక్టోబర్ 13న ఈ మూవీ విడుదల కానుంది. అయితే ఆదివారం స్నేహితుల దినోత్సవం నేపథ్యంలో 'దోస్తీ' పేరుతో ఓ ప్రమోషనల్ సాంగ్​ను రూపొందించింది చిత్రబృందం. దీనిని ఐదు భాషల్లో ఐదుగురు సింగర్స్ ఆలపించారు. తాజాగా ఈ పాటపై వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

RRR
ఆర్ఆర్ఆర్
author img

By

Published : Jul 31, 2021, 3:25 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఆతృతతో ఎదురుచూస్తోన్న ప్రాజెక్ట్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు చేరువలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రమోషన్స్‌ని చిత్రబృందం భారీగా ప్లాన్‌ చేసింది. ఇందులో భాగంగా దేశంలోనే పేరుపొందిన ఐదుగురు యువ సంగీత కెరటాలతో స్నేహగీతాన్ని క్రియేట్‌ చేయించింది.

'దోస్తీ' అంటూ సాగే ఈ పాటను స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం (ఆగస్టు 1) చిత్రబృందం విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో 'దోస్తీ' పాటను ఆలపించిన హేమచంద్ర, అనిరుధ్‌, అమిత్‌ త్రివేది ఇప్పటికే తమ అభిప్రాయాలను పంచు.. తాజాగా విజయ్‌ ఏసుదాస్‌, యాజిన్‌ నిజార్‌ కూడా కీరవాణితో కలిసి పనిచేయడం గురించి స్పందించారు.

"లెజండరీ కీరవాణి సంగీత సారథ్యంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం పాట పాడటం ఎంతో ఆనందంగా ఉంది. మునుపెన్నడూ లేనివిధంగా వివిధ భాషలకు చెందిన గాయకులమైన మేమంతా కలిసి పాన్‌ఇండియా ప్రాజెక్ట్‌ కోసం 'దోస్తీ' పాట ఆలపించాం. 'దోస్తీ' సాంగ్‌లో భాగమైనందుకు ఆనందిస్తున్నా" అని యాజిన్‌ నైజర్‌ తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అలాగే విజయ్‌ ఏసుదాస్‌ కూడా 'దోస్తీ'లో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రమోషనల్‌ సాంగ్‌ చిత్రీకరణ చాలా అద్భుతంగా జరిగిందని.. ఇలాంటి ప్రమోషనల్‌ సాంగ్‌ షూట్‌ ఎన్నడూ చూసి ఉండరని ఆయన అన్నారు.

ఇవీ చూడండి: 'అక్కినేని' ఫ్యాన్స్​కు షాకిచ్చిన సమంత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.