బాలీవుడ్ హీరో షారుక్‌ఖాన్.. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తన కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను కలిసేందుకు జైలుకు వెళ్లారు. ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలుకు శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో వెళ్లారు.
అక్టోబర్ 3న గోవాకు చెందిన క్రూజ్ నౌకలో ఎన్సీబీ అధికారులు జరిపిన దాడుల్లో ఆర్యన్ ఖాన్, మూన్‌మూన్ ధామేచ, అర్బాజ్ మెర్చంట్ సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరిని కొన్నిరోజుల క్రితం కోర్టులో హాజరు పరచగా.. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎన్సీబీకి అప్పగించింది.
ఆ కస్టడీ ముగియడం వల్ల మరోసారి నిందితులను అధికారులు కోర్టులో హాజరుపరచగా.. ఆర్యన్ సహా ఎనిమిది మందికి న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అప్పటినుంచి వారందరూ జైలులో ఉన్నారు. ఆర్యన్‌ఖాన్ తరపు న్యాయవాదులు పలుమార్లు బెయిల్ కోసం ధరఖాస్తు చేయగా, అది తిరస్కరణకు గురవుతూనే ఉంది.
ఇవీ చదవండి: