ETV Bharat / sitara

'షారుక్ సిరీస్​.. మా కథను పోలి ఉంది'

షారుక్ ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న వెబ్​సిరీస్ 'బేతాళ్'. అయితే ఈ సిరీస్ కథ , తమ సినిమా 'విటాళ్​' కథకు పోలికలున్నాయని స్క్రీన్ రైటర్స్ సమీర్, మహేశ్ ముంబయి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ సిరీస్ విడుదల వాయిదా పడింది.

author img

By

Published : May 24, 2020, 1:05 PM IST

షారుక్
షారుక్

ప్రముఖ కథానాయకుడు షారుక్‌ ఖాన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న 'బేతాళ్‌' సిరీస్‌పై వివాదం చెలరేగింది. హారర్‌ కథాంశంతో రూపొందిస్తున్న ఈ సిరీస్‌ కథ, తమ సినిమా 'విటాళ్‌' కథకు పోలికలు ఉన్నాయని స్క్రీన్‌ రైటర్స్‌ సమీర్, మహేశ్ ముంబయి హైకోర్టును ఆశ్రయించారు.

"మేం మా కథను అనేక ప్రొడక్షన్‌ హౌస్‌ల వద్దకు తీసుకెళ్లాం. కానీ రెడ్‌ చిల్లీస్‌ నిర్మాణ సంస్థకు మా కథ చెప్పలేదు. కానీ, మా ఐడియా గురించి వారికి ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు. స్క్రీన్‌ రైటర్స్‌ అసోసియేషన్‌లో (ఎస్‌డబ్ల్యూఏ) నా కథను రిజిస్టర్‌ చేసుకున్నా. గతేడాది జులైలో ఓ షోలో చెప్పా. ఈ మేరకు ఎస్‌డబ్ల్యూఏకు ఫిర్యాదు చేశాం. దాదాపు పది సన్నివేశాలు ఒకేలా ఉన్నాయి " అని వారు చెప్పారు. ఈ నేపథ్యంలో హైకోర్టు షో ప్రసారంపై స్టే విధించింది.

'బేతాళ్‌' మొదటి సిరీస్‌ మే 24న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కావాల్సి ఉంది. ఇందులో వినీత్‌ కుమార్‌, అహానా కుమార్‌, సుచిత్ర పిళ్లై, జితేంద్ర జోషి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. పాట్రిక్‌ గ్రాహం, నిఖిల్ మహాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సిరీస్‌ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. అడవుల్లో నివసిస్తున్న ప్రజల్ని మరో చోటుకి తరలించి, అక్కడ హైవే ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తారు. అందుకోసం ఆర్మీ అక్కడి వెళ్లడం.. బేతాళ్‌ కొండల్లో ఉన్న దెయ్యాల్ని ఎదుర్కోవాల్సి రావడం.. దెయ్యాలు ఆర్మీ అధికారుల శరీరాల్లోకి చేరి ప్రాణాలకు హాని చేయడం.. ఈ నేపథ్యంలో సిరీస్‌ను రూపొందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.