Sebastian Trailer: రే చీకటితో బాధపడే ఓ పోలీసు కానిస్టేబుల్ తనకు ఎదురైన సమస్య నుంచి ఎలా బయటపడ్డాడనే కథాంశంతో తీసిన సినిమా 'సెబాస్టియన్'. కిరణ్ అబ్బవరం హీరోగా నటించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకుడు. మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా 'సెబాస్టియన్' ట్రైలర్‌ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఉద్యోగం కంటే న్యాయం గొప్పదనే మాటలు 'సెబాస్టియన్' చిత్రంపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కిరణ్ సరసన నువేక్ష జంటగా నటించగా కోమలి ప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి కీలక పాత్రలు పోషించారు.
Maaran Trailer: ధనుష్ మరో సినిమా ఓటీటీలో రిలీజ్‌కు రెడీ అయింది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 'మారన్'. దీని ట్రైలర్‌ను సోమవారం రిలీజ్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆద్యంతం ఆకట్టుకుంటున్న ట్రైలర్.. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మార్చి 11న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇది విడుదల కానుంది. ఇందులో ధనుష్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్గా చేసింది. కార్తిక్ నరేశ్ దర్శకత్వం వహించగా, జీవీ ప్రకాశ్ కుమార్ దర్శకత్వం వహించారు.
'ఈటీ' అప్డేట్..

సూర్య హీరోగా నటించిన ద్విభాషా సినిమా 'ఈటీ'. దీని ట్రైలర్‌ను మార్చి 2న ఉదయం 11:30 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
ఆరోజే తాప్సీ కొత్త సినిమా..

'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' దర్శకుడు స్వరూప్ తీస్తున్న కొత్త సినిమా 'మిషన్ ఇంపాజిబుల్'. ఇప్పుడీ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఏప్రిల్ 1న థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు. ఇందులో తాప్సీతో పాటు మరో ముగ్గురు పిల్లలు కీలకపాత్రలో నటిస్తున్నారు.


ఇదీ చూడండి: ప్రభాస్ 'రాధేశ్యామ్' కొత్త ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్