ETV Bharat / sitara

సర్కారు వారి పాట కొత్త పోస్టర్.. రవితేజ 'రామారావు' టీజర్ - ఆర్​ఆర్​ఆర్ చిత్రం

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా 'సర్కారు వారి పాట', 'ఆర్​ఆర్​ఆర్​' 'సూర్య ఈటీ' చిత్రాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. వాటిని మీరూ చూసేయండి.

sarkaru vari pata
సర్కారు వారి పాట
author img

By

Published : Mar 1, 2022, 4:18 PM IST

Updated : Mar 1, 2022, 4:33 PM IST

Sarkaru Vaari Paata Release Date: సూపర్​స్టార్ మహేశ్​బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సర్కారు వారిపాట'. కీర్తి సురేశ్ కథానాయిక. ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఫుల్​ యాక్షన్​ బ్యాక్​డ్రాప్​లో ఉన్న పోస్టర్ మహేశ్​ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో మహేశ్​బాబు బ్యాంకు అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

new  movie posters
.

రవితేజ 'రామారావు' టీజర్

Ravi Teja Ramarao on Duty: మాస్​ మహారాజా రవితేజ​ నటిస్తున్న 'రామారావు ఆన్​ డ్యూటీ' చిత్రం టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని మార్చి 25న గానీ, పరిస్థితులు అనుకూలించకపోతే ఏప్రిల్ 15న గానీ రిలీజ్​ చేస్తామని తెలిపింది చిత్రబృందం.

యాక్షన్ ఎంటర్​టైనర్​గా రూపొందుతున్న ఈ చిత్రానికి శరత్​ మాండవ దర్శకత్వం వహిస్తుండగా.. దివ్యాంశ కౌషిక్​ హీరోయిన్​గా నటిస్తోంది. సామ్​ సీఎస్​ సంగీతం అందిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అలా పార్కులో సరదాగా..

RRR Release Date: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాలోని ఓ వర్కింగ్ స్టిల్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్​గా మారింది. ఈ స్టిల్​లో ఎన్టీఆర్, రామ్​చరణ్ ఫోన్​లు చూసుకుంటూ పార్కులో పడుకుని ఉన్నారు. షూటింగ్ బ్రేక్​లో ఇద్దరూ తమ ఫోన్లలో నిమగ్నమయ్యారు.

ఈ చిత్రం మొదట జనవరి 7న విడుదల కావాల్సి ఉండగా కొవిడ్ వల్ల వాయిదా పడింది. అయితే మార్చి 7న థియేటర్లలోకి తీసుకురావాలని చూసినా.. ఒమిక్రాన్ కేసుల కారణంగా మరోసారి వాయిదా పడింది. ఇప్పుడు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

new  movie posters
.

దాదాపు రూ.450కోట్ల భారీ బడ్జెట్​తో నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించారు. అజయ్​ దేవగణ్​, ఆలియా భట్​, శ్రియ కీలక పాత్రలో నటించారు.

సూర్య 'ఈటి'

new  movie posters
.

Etharkum Thuninthavan Movie Release Date: 'ఆకాశమే హద్దురా', 'జై భీమ్​' చిత్రాలతో వరుస హిట్లు కొట్టారు హీరో సూర్య. ఇప్పుడు 'ఈటి' చిత్రంతో వెండితెరపై సందడిచేసేందుకు సిద్ధమయ్యారు. ఈటి చిత్రం మార్చి 12 న విడుదల కానుంది. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్​ బుధవారం సందడి చేయనుంది.

ఆది కొత్త సినిమా పోస్టర్​..

new  movie posters
.

Aadi CSI Movie: హీరో ఆది నుంచి కొత్త సినిమా ప్రకటన వచ్చింది. సీఎస్​ఐ సనాతన్​ అనే థ్రిల్లర్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్​ను విడుదల చేశారు.

'ది వారియర్'లో ఆది పినిశెట్టి

new  movie posters
.

Ram the warrior movie: హీరో రామ్ పోతినేని వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో 'ది వారియర్'​ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఆది కోపంతో రగిలిపోతూ ఉన్నట్లుగా పోస్టర్​ ఆసక్తి రేకెత్తిస్తోంది.

హన్సిక కొత్త లుక్..

new  movie posters
.

Hansika motwani latest movie: హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'మై నేమ్ ఈజ్ శ్రుతి'. ఈ చిత్రానికి శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహించగా, బురుగు రమ్య ప్రభాకర్ నిర్మాతగా వ్యవహరించారు. మహాశివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ సినిమా పోస్టర్ ఆకట్టుకుంటోంది.

హే! సినామిక కొత్త పోస్టర్..

new  movie posters
.

Hey sinamika movie release date: దుల్కర్​ సల్మాన్ 'హే! సినామిక' చిత్రం నుంచి కొత్త పోస్టర్​ విడుదలైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి3న విడుదలకు సిద్ధమైంది.

ఇదీ చూడండి:

'కచ్చా బాదమ్'​ సింగర్​కు రోడ్డు ప్రమాదం!

శివరాత్రి స్పెషల్​.. 'భోళాశంకర్'​ స్పెషల్​ వీడియో రిలీజ్​

Last Updated : Mar 1, 2022, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.