‘మేం భార్యాభర్తలుగా విడిపోతున్నాం’ అంటూ నాగ చైతన్య, సమంత(Samantha latest news) ప్రకటించడమే ఆలస్యం మీడియాలో, సామాజిక మాధ్యమాల వేదికగా ఎన్నో అసత్య ప్రచారాలు జరిగాయి. ఎంతోమంది సమంత గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. 'ఫలానా వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్లే సమంత ఇలా చేసింది', 'ఆ సినిమాల్లో శ్రుతి మించి నటించడమే ఇందుకు కారణం', 'సమంత పిల్లలను వద్దనుకుంది' అంటూ తమకు ఇష్టం వచ్చినట్టు కథనాలు రాశారు. అయితే, ఇప్పటి వరకూ వీటిపై పెదవి విప్పని సమంత.. ఇప్పుడు వాటిపై స్పందించింది. ఈ మేరకు రూమర్స్‌కు చెక్‌పెడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
"నాపై మీరు చూపిస్తున్న సానుభూతికి కృతజ్ఞతలు. అయితే, కొందరు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు. నాకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లల్ని వద్దనుకున్నానని, అబార్షన్ చేయించుకున్నానని, నేను అవకాశవాదినని అంటున్నారు. విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతోకూడుకున్నది. నన్ను ఒంటరిగా వదిలేయండి. వ్యక్తిగతంగా నాపై దాడి చేయడం నిర్దయతో కూడుకున్నదే. భవిష్యత్‌లో ఇలాంటి వాటిని ఎన్నటికీ సహించను" అని సమంత(Samantha latest news) ట్వీట్ చేసింది.
ఈ నెల 2వ తేదీన తాము విడిపోవటంపై సమంత(Samantha latest news), నాగచైతన్య ఏకకాలంలో సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. "మా శ్రేయోభిలాషులందరికీ.. ఇక నుంచి మేం భార్య-భర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి వేర్వేరుగా మా సొంత మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్నాం. పదేళ్లుగా మా స్నేహం కొనసాగినందుకు మేం అదృష్టవంతులం. మా స్నేహం వివాహ బంధానికి చాలా కీలకంగా నిలిచింది. ఇప్పుడు ఈ కష్ట సమయంలో అభిమానుల మద్దతు కావాలి. మా గోప్యతను కాపాడాలని శ్రేయోభిలాషులు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం" అని ఇరువురూ పోస్ట్ చేశారు.
![Samantha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13298427_samantha1.jpg)
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఈ వార్త హాట్ టాపిక్ అయింది. ముచ్చటైన జంట విడిపోయిందంటూ అభిమానులు బాధపడ్డారు. నాగచైతన్య-సమంత(samantha and naga chaitanya) విడిపోవటం బాధాకరమని అగ్ర కథానాయకుడు నాగార్జున విచారం వ్యక్తం చేశారు. భార్యాభర్తల మధ్య ఏం జరిగినా అది వాళ్ల వ్యక్తిగతమని, ఇద్దరూ తనకెంతో దగ్గరి వారని నాగార్జున అన్నారు. వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు 'మనం ఏదైనా విషయంపై పెదవి విప్పే ముందు దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించాలి' అంటూ వెంకటేశ్(venkatesh daggubati movies) పెట్టిన పోస్ట్ సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఇవీ చదవండి: