ETV Bharat / sitara

'గాడ్​ఫాదర్'​ సల్మాన్​ షెడ్యూల్​ పూర్తి​.. 'బజరంగి భాయిజాన్'​ సీక్వెల్​ అప్డేట్​ - గాడ్​ఫాదర్​ సల్మాన్​ఖాన్

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో చిరంజీవి 'గాడ్​ఫాదర్'​, సల్మాన్​ఖాన్​​ 'బజరంగి భాయిజాన్', ప్రభాస్​ 'రాధేశ్యామ్'​, యువహీరో నాగచైతన్య కొత్త చిత్రాల సంగతులు ఉన్నాయి.

salman khan
సల్మాన్​ ఖాన్​
author img

By

Published : Mar 24, 2022, 7:10 PM IST

Salmankhan Bajrangi Bhaijaan: అయితే తాజాగా 'ఆర్​ఆర్​ఆర్​' ప్రమోషన్స్​లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయేంద్రప్రసాద్​.. ఈ సినిమా గురించి ప్రస్తావించారు. 'బజరంగి భాయిజాన్'​ చిత్రం సీక్వెల్​ పక్కాగా ఉంటుందని, త్వరలోనే సెట్స్​పైకి వెళ్తుందని చెప్పారు. 'పవన్​ పుత్ర భాయిజాన్​'గా ఇది రూపొందుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయని చెప్పారు. కబీర్‌ఖాన్‌ దర్శకత్వం వహించిన 'బజరంగీ..' 2015 జులై 17న విడుదలైంది. పాకిస్థాన్‌కు చెందిన మూగ, చెవిటి చిన్నారిని తన కన్నవారి వద్దకు చేర్చేందుకు భారతీయ యువకుడు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడనేది ఈ చిత్ర కథ.

Godfather Salmankhan Chiranjeevi: చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'గాడ్‌ఫాదర్‌'లో సల్మాన్‌ఖాన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముంబయిలో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణ కోసం ఆయన ఇప్పటికే రంగంలోకి దిగారు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు మోహన్​రాజా షూటింగ్​ సెట్​లో సల్మాన్​ఖాన్​తో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్​ చేశారు. సల్మాన్​ఖాన్​తో ఓ అద్భుతమైన షెడ్యూల్​ పూర్తైందని చెప్పారు. 'ఇండియాస్​ మోస్ట్​ ఫేవరెట్​ భాయ్​తో మధుర క్షణాలు' అంటూ వ్యాఖ్య రాసుకొచ్చారు. మలయాళంలో విజయవంతమైన 'లూసిఫర్‌'కు రీమేక్‌గా రూపొందుతున్న సినిమా ఇది. ఆర్‌.బి.చౌదరి, ఎన్వీప్రసాద్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజకీయం నేపథ్యంలో సాగే కథ ఇది.

Nagachaitanya Manadu movie director: ఇటీవలే 'లవ్​స్టోరీ', 'బంగార్రాజు' సినిమాలతో సక్సెస్​ అందుకున్న యువహీరో నాగచైతన్య కెరీర్​లో దూసుకెళ్తున్నారు. త్వరలోనే 'లాల్​సింగ్​చద్ధా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆయన.. ప్రస్తుతం 'థ్యాంక్యూ' సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత తమిళ దర్శకుడు వెంకట్​ ప్రభుతో కలిసి ఓ సినిమా చేయనున్నారనే వార్త ఒకటి కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇందులో హీరోయిన్​గా పూజాహెగ్డే నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్​ పక్కా అయినట్లు తెలిసింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్​ వివరాలను అధికారికంగా ప్రకటించి.. చిత్ర వివరాలను తెలియజేస్తారట. వెంకట్‌ప్రభు ఇటీవల తమిళంలో 'మానాడు' తెరకెక్కించి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా తెలుగులోనూ రీమేక్‌ కానుంది.

Prabhas Radheshyam E rataley song: ప్రభాస్‌ అభిమానులు, సినీ ప్రేక్షకులకు 'రాధేశ్యామ్‌' చిత్రం నుంచి మరో కానుక అందింది. ఇప్పటికే 'నగుమోము తారలే' ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా 'ఈ రాతలే' ఫుల్‌ వీడియో గీతాన్ని పంచుకుంది. ఈ పాటలోని ప్రభాస్‌ లుక్స్‌, పూజా క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, అద్భుతమైన లొకేషన్లు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. కృష్ణకాంత్‌ రచించిన ఈ గీతాన్ని యువన్‌ శంకర్‌ రాజా, హరిణి ఇవటూరి ఆలపించారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలందించారు. పీరియాడికల్‌ థ్రిల్లర్‌ లవ్‌స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో హస్తసాముద్రికా నిపుణుడు విక్రమాదిత్యగా ప్రభాస్‌, ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా అలరించారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్‌ ఖేడ్‌కర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: విజయ్​సేతుపతి మంచి మనసు.. లక్షమందికిపైగా నిరుద్యోగులకు అండగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.