RRR release date: 'ఆర్ఆర్ఆర్'.. థియేటర్లలోకి రావడానికి మరో రెండు వారాల సమయముంది. చిత్రబృందం నేషనల్ వైడ్ ప్రచారంలో బిజీగా ఉంది. మరోవైపు సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానుల మనసులో ఆత్రుతగా ఉంది. ఇన్ని విషయాల మధ్య 'ఆర్ఆర్ఆర్' చిత్రం అరుదైన ఘనత సాధించింది.
యూఎస్‌లో 'ఆర్ఆర్ఆర్' సరికొత్త రికార్డు సృష్టించింది. రిలీజ్‌కు ముందే మిలియన్ డాలర్లు వసూళ్లు అందుకున్న సినిమాగా నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారత చిత్రం ఇదే కావడం విశేషం. యూఎస్‌లో జనవరి 6న 'ఆర్ఆర్ఆర్' ప్రీమియర్స్ వేయనున్నారు.
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్'లో రామ్‌చరణ్, అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో సినిమాను నిర్మించారు. జనవరి 7న మన దేశంలో విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి:
- 'ఆర్ఆర్ఆర్'లో అదిరిపోయే సీన్.. సీక్రెట్ రివీల్ చేసిన జక్కన్న
- 'ఆర్ఆర్ఆర్' రిలీజ్.. ఎవరూ ఆ సాహసం చేయొద్దు: సల్మాన్‌ఖాన్
- RRR movie: రాబోయే మూడు వారాలు రచ్చ రచ్చే!
- RRR trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. సరికొత్త రికార్డు
- రాజమౌళి డైరెక్షన్‌ను డామినేట్ చేసిన ఓన్లీ హీరో అతడు!
- నాటు నాటు స్టెప్.. రాజమౌళి వల్ల ఎన్టీఆర్‌కు కష్టాలు!