ETV Bharat / sitara

మహీంద్రా ఆఫీస్​లో 'ప్రాజెక్ట్​ కె'.. తొలి భారతీయ చిత్రంగా 'ఆర్​ఆర్​ఆర్​'

Prabhas Project K: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. పాన్​ఇండియా స్టార్ ప్రభాస్​ 'రాధేశ్యామ్​', 'ప్రాజెక్ట్ కె' సహా 'ఆర్ఆర్​ఆర్'​ చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

prabhas project k
rrr dolby cinema
author img

By

Published : Mar 13, 2022, 9:31 PM IST

Prabhas Project K: 'ప్రాజెక్ట్​ కె' సినిమా పనుల్లో భాగంగా ఆదివారం మహీంద్రా రీసెర్చ్​ వ్యాలీకి వెళ్లారు దర్శకుడు నాగ్​ అశ్విన్. ఈ సందర్భంగా.. "సాంకేతికతను ప్రకృతి కలిసే చోటు" అంటూ ఆ క్యాంపస్​ను కొనియాడారు. ఇటీవలే ఈ చిత్రానికి సాంకేతిక సహకారం కావాలని నాగ్​ అశ్విన్​ కోరగా.. అందుకు సంతోషంగా అంగీకరించారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్​ మహీంద్ర. ఈ క్రమంలోనే ఆయన మహీంద్రా క్యాంపస్​కు వెళ్లారు. ఈ సినిమాను దేశానికి గర్వకారణంగా నిలిచేలా రూపొందిస్తానన్న తన మాట నిలబెట్టుకునేందుకు ఎంతో ఉత్సాహంతో పనిచేస్తానని నాగ్​ అశ్విన్ అన్నారు.

'ప్రాజెక్ట్​ కె'లో ప్రభాస్‌ సూపర్‌హీరో రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. దీపికా పదుకొణె హీరోయిన్. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

డాల్బీలో 'ఆర్​ఆర్​ఆర్​'

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్​ఆర్'​.. మరో ప్రత్యేకతను సంతరించుకుంది. డాల్బీ సినిమాలో రిలీజ్​కానున్న తొలి భారతీయ చిత్రంగా నిలవనుంది. డాల్బీ సాంకేతికతతో మంచి విజువల్​ సహా అద్భుతమైన సౌండ్​ను ప్రేక్షకుడు అనుభూతి చెందుతాడు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

rrr release date
'ఆర్​ఆర్​ఆర్​'

రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లు. అజయ్​ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య నిర్మాత.

మహేశ్ చేతుల మీదుగా..

mishan impossible telugu movie
'మిషన్​ ఇంపాజిబుల్​'

'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ' సినిమాతో గుర్తింపు దక్కించుకున్న యువ దర్శకుడు స్వరూప్​ ఆర్​ఎస్​జే దర్వకత్వంలో 'మిషన్​ ఇంపాజిబుల్'​ అనే చిత్రం తెరకెక్కనుంది. తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్​ను మార్చి 15న సూపర్​స్టార్​ మహేశ్​బాబు రిలీజ్​ చేయనున్నారు.

రోషన్​.. క్రేజీ ఛాన్స్​..

roshan meka
రోషన్​ కొత్త చిత్రం

నటుడు శ్రీకాంత్ కుమారుడు, యువ హీరో రోషన్.. బంపర్​ ఆఫర్​ కొట్టేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్​లో ఓ సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన ప్రకటనతో ఆదివారం (మార్చి 13) రోషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పోస్టర్​ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్​ అద్వైతం దర్శకత్వం వహించనున్నారు.

'రాధేశ్యామ్' రెండో రోజు కలెక్షన్లు..

radhe shyam collection day 2
'రాధేశ్యామ్'

పాన్​ఇండియా స్టార్​ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్​' సినిమా కలెక్షన్లలో దూసుకుపోతోంది. మంచి ప్రేమ కథతో పాటు అద్భుతమైన విజువల్స్​తో తెరకెక్కిన్న ఈ సినిమా మార్చి 11న విడుదలైంది. తొలి రోజు రూ.79 కోట్లు వసూలు చేసిన 'రాధేశ్యామ్' కలెక్షన్లు.. రెండో రోజుకు రూ.119 కోట్లకు (గ్రాస్) చేరుకున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'రాధేశ్యామ్​' నుంచి ఆదివారం 'నిన్నేలే' అనే వీడియో సాంగ్​ను రిలీజ్​ చేసింది చిత్రబృందం. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా నటించారు ప్రభాస్‌. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యు.వి.క్రియేషన్స్‌ ఈ సినిమాను నిర్మించింది. రాజమౌళి ఈ సినిమాకు వాయిస్ ఓవర్​​ ఇచ్చారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అందించారు.

ఇదీ చూడండి: కశ్మీరీ పండిట్ల కన్నీటి గాథ.. 'ది కశ్మీర్​ ఫైల్స్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.