టాలీవుడ్‌కు సిక్స్ ప్యాక్‌ను పరిచయం చేసిన హీరోగా అల్లు అర్జున్‌కు పేరుంది. 'దేశముదురు' సినిమాలో విభిన్న శరీరాకృతి కోసం ఇలా ఆరు పలకల దేహంతో కనిపించాడు బన్నీ. ఈ హీరోను ఆదర్శంగా తీసుకునే చాలా మంది యువ నటులు సిక్స్ ప్యాక్‌లో దర్శనమిచ్చారు. అలాంటి నటుల్లో నవదీప్ కుడా ఉన్నాడు.
ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన నవదీప్.. తాను అల్లు అర్జున్ను స్ఫూర్తిగా తీసుకునే సిక్స్ ప్యాక్ బాడీ కోసం కష్టపడ్డట్లు తెలిపాడు. ఓ రొమాంటిక్ ఫాంటసీ సినిమా కోసం బాడీ పెంచానని, కానీ ఆ చిత్రం పట్టాలెక్కలేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడీ హీరో.