ETV Bharat / sitara

లాక్​డౌన్ అనుభవంపై రష్మిక ఎమోషనల్​ పోస్ట్ - రష్మిక తాజా వార్తలు

లాక్​డౌన్​తో ఇంట్లోనే ఉన్న కథానాయిక రష్మిక.. భావోద్వేగభరిత సందేశాన్ని ఇన్​స్టాలో రాసుకొచ్చింది. తన జీవితంలోని మారథాన్ రేస్​​లో ఫినిషింగ్ లైన్​ దగ్గరకు చేరుకున్నట్లు అనిపిస్తోందని, త్వరలో మళ్లీ ఈ పరుగు మొదలవుతుందని తెలిపింది.

లాక్​డౌన్ అనుభవంపై రష్మిక ఎమోషనల్​ పోస్ట్
కథానాయిక రష్మిక
author img

By

Published : May 29, 2020, 8:48 AM IST

లాక్​డౌన్​తో రెండు నెలల నుంచి ఇంట్లోనే ఉన్న హీరోయిన్ రష్మిక.. భావోద్వేగభరిత సందేశాన్ని ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. 18 ఏళ్లు వచ్చినప్పటినుంచి తన జీవితం మారథాన్ రేస్​లా పరుగెడుతూనే ఉందని, ఇప్పుడది ఫినిషింగ్ లైన్​ దగ్గరకు వచ్చినట్లు అనిపిస్తుందని చెప్పింది. త్వరలో ఈ రేస్ మళ్లీ మొదలవుతుందని రాసుకొచ్చింది. తల్లిదండ్రులు, సోదరి.. తనకు అండగా నిలబడిన విషయం గురించి చెప్పుకొచ్చిందీ భామ.

"18 ఏళ్ల వయసు నుంచి నా జీవితం మారథాన్ రేసులానే ఉంది. ఇప్పుడు పినిషింగ్ లైన్ దగ్గరకు వచ్చినట్లు అనిపిస్తోంది. ఇది మళ్లీ త్వరలో ప్రారంభమవుతుంది. అయితే ఈ విషయంపై నేనేం ఫిర్యాదు చేయడం లేదు. ఎందుకంటే గత కొన్నేళ్లలో ఎక్కువ కాలం ఇంట్లో ఉన్నది ఇప్పుడే. పాఠశాల నుంచి ఉన్నత విద్య చదివే వరకు హాస్టల్​లోనే ఉన్నా. దానితో పాటే నా తల్లిదండ్రులు స్ట్రిక్ట్​గా ఉండటం వల్ల టీనేజ్​కు వచ్చేసరికి రెబల్​లా తయారయ్యా. లాక్​డౌన్ వల్ల దాదాపు 2 నెలల నుంచి ఇంట్లోనే ఉంటున్నా. ఇదెంతో ప్రత్యేకమైన విషయం. ఈ సమయంలో పనిగురించి ఏం అడగకుండా అమ్మనాన్న.. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేలా మానసిక ధైర్యాన్నిచ్చారు. మీరు చాలాకాలం పాటు పనిచేసి, ఇంటికొచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలా అనిపిస్తే మీరు నిజంగా అదృష్టవంతులే" -రష్మిక మంధాన, హీరోయిన్

ఈ ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' వంటి చిత్రాలతో హిట్​లు కొట్టిన రష్మిక.. ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప'లో హీరోయిన్​గా నటిస్తోంది. దీనితో పాటే పొగరు(కన్నడ), సుల్తాన్(తమిళం)లోనూ కథానాయికగా కనిపించనుంది.

Rashmika Mandanna
హీరోయిన్ రష్మిక మంధాన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.