ETV Bharat / sitara

మహేశ్​-రాజమౌళి సినిమా లేనట్టేనా? - మహేష్​ బాబు రాజమౌళి

దర్శకధీరుడు ఎస్​ఎస్​ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'ఆర్​ఆర్​ఆర్​'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్​ ప్రొడక్షన్​ వర్క్​ తుదిదశకు చేరుకుంది. అయితే ఈ సినిమా పూర్తవ్వగానే జక్కన్న తెరకెక్కిచనున్న సినిమా ఏదనే విషయంపై ఇప్పుడు చిత్రసీమలో చర్చ నడుస్తోంది.

Rajamouli gave nods to Mythri Movie Makers?
మహేశ్​-రాజమౌళి సినిమా లేనట్టేనా?
author img

By

Published : Sep 14, 2021, 9:35 PM IST

ప్రస్తుతం 'ఆర్ఆర్‌ఆర్‌' మూవీతో బిజీగా ఉన్నారు అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. మరి ఈ సినిమా తర్వాత రాజమౌళి చేయబోయే ప్రాజెక్ట్‌ ఏంటి? కథానాయకుడు ఎవరు? అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలను జక్కన్న కలిశారట. వీరి కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

భారతీయ చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ తెరకెక్కని భారీ బడ్జెట్‌తో ఈ సినిమా ఉంటుందని టాక్‌. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమిక చర్చలు మాత్రమే నడిచినట్లు తెలుస్తోంది. పూర్తి కథ ఏంటి? కథానాయకుడు ఎవరు? అన్న విషయాలు తెలియరాలేదు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మహేశ్​తో సినిమా లేనట్టేనా?

మహేశ్‌బాబుతో ఓ మూవీ చేస్తానని రాజమౌళి గతంలోనే ప్రకటించారు. 'ఆర్ఆర్ఆర్‌' తర్వాత ఆ సినిమా ప్రారంభం కానుందని అందరూ భావిస్తున్నారు. అడ్వెంచర్‌, యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని ఓ ఇంటర్వ్యూలో రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ చెప్పారు.

ఇప్పుడు రాజమౌళి మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలను కలవడం వల్ల ఆసక్తిని కలిగిస్తోంది. మహేశ్‌ ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్నారు. దాని తర్వాత త్రివిక్రమ్‌ క్యాంప్‌లోకి మహేశ్​ పాల్గొంటారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి అప్పటివరకూ రాజమౌళి వేచి చూస్తారా? లేక మరో హీరోతో కొత్త ప్రాజెక్టు నిర్మిస్తారా? తెలియాల్సిఉంది.

ఇదీ చూడండి.. MAA Elections 2021: గెలిచినా.. ఓడినా.. 'మా' కోసమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.