ETV Bharat / sitara

'నేను డైరక్ట్‌ చేయాలంటే ఆ పరిస్థితి రావాలేమో'

'జాతిరత్నాలు' సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హాస్యనటుడు రాహుల్​ రామకృష్ణ. ఈ సందర్భంగా తన కెరీర్ సహా ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.​ అతని జీవితంలో మంచి విమర్శకులు తన తల్లి అని చెప్పాడు. 'బాగా నటించావు' అని ఆమె ఎప్పుడు అంటుందా అని ఇంకా ఎదురు చూస్తున్నట్లు ఆయన వెల్లడించాడు.

jati
రాహుల్​ రామకృష్ణ
author img

By

Published : Mar 15, 2021, 5:32 AM IST

"నా జీవితంలో మంచి విమర్శకురాలు మా అమ్మే.. 'బాగా నటించావు' అని ఆమె ఎప్పుడు అంటుందా అని ఇంకా ఎదురు చూస్తున్నా" అంటున్నాడు నటుడు రాహుల్‌ రామకృష్ణ. 'అర్జున్‌రెడ్డి'తో అందరి దృష్టినీ ఆకర్షించిన నటుడీయన. హాస్యం పంచడంలో ఆయనదో ప్రత్యేకమైన శైలి. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'జాతిరత్నాలు'లో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శితో కలిసి కడుపుబ్బా నవ్వించారు. ఈ సందర్భంగా రాహుల్‌ రామకృష్ణ పంచుకున్న విషయాలివీ..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'జాతిరత్నాలు' ఇంత హిట్టవుతుందనుకున్నారా?

'జాతిరత్నాలు'కు ఈ స్థాయి విజయాన్ని ఊహించలేదు. దర్శకుడు అనుదీప్‌ కథ చెప్పినప్పుడు మాత్రం కిందపడి మరీ నవ్వుకున్నా. సహజంగా ఒక నటుడికి కామెడీ ఇంత బాగా నచ్చినప్పుడు, ఇది జనాలకీ అంతే నచ్చుతుందా లేదా? అనే సందేహాలొస్తాయి. ఒకొక్కరి అభిరుచి ఒకలా ఉంటుంది కదా. సినిమా విడుదల తర్వాత ఆ సందేహాలన్నీ ఎగిరిపోయాయి. స్టీఫెన్‌ చౌతోపాటు, ప్రపంచ సినిమాని చూసి తనలో ఇముడ్చుకున్నాడు దర్శకుడు అనుదీప్‌. ఎంత సీరియస్‌ సందర్భాన్నైనా... తన వ్యంగ్యంతో లైట్‌గా మార్చేయగలడు‌. ఆ లక్షణమే మమ్మల్నందరినీ ఈ సినిమా చేసేందుకు ఒప్పించింది.

మీ ముగ్గురి మధ్య టైమింగ్‌ బాగా కుదిరింది కారణం?

నేనూ, ప్రియదర్శి, నవీన్‌.. తెరపై కనిపించినట్టుగానే బయటా మా మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అదే మా పాత్రల మధ్య కెమిస్ట్రీపై ప్రభావం చూపించింది. నిజానికి నేను, నవీన్‌ ఇదివరకు కలిసిందే లేదు. ఈ సినిమాకి ముందే ఇద్దరం ఒకరికొకరు పరిచయం అయ్యాం. ప్రియదర్శితో 12 యేళ్లుగా కలిసి ప్రయాణం చేస్తున్నా. ఈ సినిమా పనులు మొదలయ్యాక దర్శి ఎలాగో, నవీన్‌ మాతో అంత సన్నిహితంగా మెలిగాడు. అందుకే ముగ్గురు జాతిరత్నాలు అంతగా నవ్వుల్ని పండించారు.

jati
రాహుల్​ రామకృష్ణ

మీ నిజ జీవితంలో సువర్ణ దొరికిందా?

సినిమాలోలాగే నా జీవితంలో సువర్ణ లేదు. వెతుక్కుంటున్నా. మిస్డ్‌ కాల్స్‌ వస్తున్నాయంతే (నవ్వుతూ). పెళ్లి చేసుకోమని మా అమ్మ నన్నెప్పుడూ బలవంతం చేయలేదు. నా సినిమాల్ని చూశాక మా అమ్మ ఇంట్లో ఉన్నట్టే ఉన్నావు కదరా.. కొత్తగా ఏమీ లేదు అంటుంది. నా జీవితంలో మంచి విమర్శకురాలు మా అమ్మే. మా అమ్మ ‘నువ్వు బాగా నటించావు’ అని ఏ రోజు అంటుందో కానీ... ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా.

ఎలాంటి పాత్రలు ఎక్కువ ఇష్టపడతారు?

నా దగ్గరికొచ్చే వంద కథల్లో ఎనభై పాత్రల్ని నేను చేయలేను. అవి పూర్తిగా వాణిజ్య సూత్రాలతో ముడిపడి ఉంటాయి. కథ, పాత్రలో కొత్తదనం ఉంటేనే చేస్తున్నా. ఇప్పటివరకు 38 సినిమాలు చేశా. రోజుకి నాలుగు గంటలే నిద్రపోతున్నా. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుందామన్నా... ఎటుచూసినా కెమెరాలే కనిపిస్తున్నాయి. వ్యక్తిగత జీవితమే లేదనిపించినా... ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నా.

దర్శకత్వం చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా?

అలాంటివి ఏవీ లేవు. నేనే నిర్మాత అయ్యి, నేనే చేతులు కాల్చుకునే పరిస్థితిలో ఉంటే అప్పుడు చేస్తానేమో.

jati
జాతిరత్నాలు

ఈ మధ్య ఏదో యాక్షన్‌ సన్నివేశాల్లోనూ నటించినట్లు ఉన్నారు?

'వై' అనే సినిమా కోసం తొలిసారి యాక్షన్‌ సన్నివేశాల్లో నటించా. నాకది బాగా నచ్చింది. అది చేశాక... నేనూ కండలుపెంచేసి హీరోనో, విలనో అయితే బాగుంటుంది కదా అనుకున్నా. కానీ ఆ తర్వాత ఇదంతా మన వల్ల కాదులే అని ఆగిపోయా.

ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేతులో ఉన్నాయి?

ఇటీవల కొత్తగా నాలుగు ప్రాజెక్టులకి ఓకే చెప్పా. ఈ యేడాది విడుదలవుతున్న ఓ పెద్ద ప్రాజెక్ట్‌లోనూ నటిస్తున్నా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.