ETV Bharat / sitara

'క్లైమాక్స్ ఎపిసోడ్​ కోసమే రెండేళ్లు కష్టపడ్డాం'

author img

By

Published : Mar 7, 2022, 5:21 PM IST

Updated : Mar 7, 2022, 11:02 PM IST

Radhe shyam release date: రాధేశ్యామ్​ చిత్రం విడుదల నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్​​ ప్రభాస్ ఆసక్తికర విషయాలను మీడియాతో షేర్​ చేసుకున్నారు. చిత్రంలోని క్లైమాక్స్ ఎపిసోడ్​ కోసమే దాదాపు రెండేళ్లు కష్టపడ్డామన్నారు.

radhe shyam
ప్రభాస్ రాధేశ్యామ్

Radhe shyam release date: ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్​' చిత్రం మార్చి11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రొమోషన్స్​ను వేగవంతం చేసింది చిత్రబృందం. హైదరాబాద్​లో నిర్వహించిన ప్రెస్​ మీట్​లో పాల్గొంది.

ఈ క్రమంలో చిత్ర కథానాయకుడు ప్రభాస్​ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 'రాధేశ్యామ్​' క్లైమాక్స్​ కోసమే రెండేళ్లు కష్టపడ్డాం అని తెలిపారు. సినిమాను మేము ఒకలాగా చూస్తే.. తమన్​ మరోలా చూశారని.. తన బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​తో 'రాధేశ్యామ్​'చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రభాస్ కొనియాడారు​.

" చాలారోజుల తర్వాత పెదనాన్నగారి(కృష్ణంరాజు) నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్​తో పనిచేయడం సంతోషాన్నిచ్చింది. ఈ సినిమాలో పెద నాన్న ఓ పవర్​ఫుల్ పాత్ర చేస్తున్నారు. ఆర్ట్​ డైరెక్టర్ రవితో ఛత్రపతి నుంచి పనిచేస్తున్నా. ప్రతి సీన్ ఎంతో కేర్ తీసుకుని చేస్తారు. జస్టిన్​ ప్రభాకరన్ పాటలు బాగున్నాయి. క్లైమాక్స్​ కోసమే రెండేళ్లు కష్టపడ్డాం."

-- ప్రభాస్​

ఇక ఈ చిత్రం అమెరికాలో గ్రాండ్​గా రిలీజ్​ అయ్యేందుకు సిద్ధమైంది. మార్చి 10న రికార్డు స్థాయిలో ప్రీమియర్​ షోలు ప్రదర్శన కానున్నాయి. 1,116 లోకేషన్లలో 11,116 షోలు వేయనున్నారు. అడ్వాన్స్​ బుకింగ్స్​ కూడా రికార్డు స్థాయిలో అవుతున్నట్లు తెలిసింది.

రొమాంటిక్ లవ్​స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి వాయిస్ ఓవర్​​ ఇచ్చారు. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్- గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.

రెండు భాగాలుగా సలార్​..?

కేజీఎఫ్​ డైరెక్టర్​ ప్రశాంత్ నీల్​ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న చిత్రం 'సలార్​'. సలార్ కూడా కేజీఎఫ్ లాగే రెండు భాగాలు ఉంటుందని ఫ్యాన్స్​ ఊహించుకుంటున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా చేస్తున్నారా..? అని అడగ్గా.. ప్రభాస్ నవ్వుతూ ఆ ప్రశ్నను దాటేశారు. కేజీఎఫ్​ను నిర్మించిన హోంబలే సంస్థనే ఈ చిత్రాన్నీ తీస్తోంది. ఈ ఏడాదే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'ప్రభాస్ సెట్​లో ఉంటే ఫుల్ ఎంజాయ్'

Last Updated : Mar 7, 2022, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.