ETV Bharat / sitara

'రాధేశ్యామ్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. వాళ్లే అతిథులు - prabhas movie

రామోజీ ఫిల్మ్​సిటీలో 'రాధేశ్యామ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 23న జరగనుంది. అయితే ఈ ఈవెంట్​కు అభిమానులే అతిథులని చిత్రబృందం వెల్లడించింది. అలానే ఈ కార్యక్రమం జరిగే చోటు వింటేజ్​ యూరప్​ సెట్​లా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

radhe shyam pre release event
ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ
author img

By

Published : Dec 17, 2021, 7:13 PM IST

Updated : Dec 17, 2021, 7:42 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'రాధేశ్యామ్' చిత్ర ముందస్తు విడుదల వేడుకలకు వేదిక ఖరారైంది. ఈ నెల 23న హైదరాబాద్​లోని రామోజీఫిల్మ్ సిటీ వేదికగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ కార్యక్రమానికి అభిమానులే అతిథులుగా హాజరవుతారని పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రభాస్ అభిమానులు ఈ వేడుకలకు రానున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలకు కచ్చితంగా పాటించాలని చిత్రబృందం సూచించింది. ఇదే వేదికపై 5 భాషల్లో రాధేశ్యామ్ ట్రైలర్​ను విడుదల చేయనున్నారు.

prabhas
ప్రభాస్ 'రాధేశ్యామ్' మూవీ

ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు 'రాధేశ్యామ్'పై ఆసక్తి రేకెత్తిస్తుండగా ట్రైలర్, సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫిల్మ్ సిటీ వేదికగా కట్టుదిట్టమైన భద్రత మధ్య ముందస్తు విడుదల వేడుకలను ప్రకటించడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. వచ్చే ఏడాది జనవరి 14న 'రాధేశ్యామ్' ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Dec 17, 2021, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.