Radhe shyam songs: కొన్నిరోజుల క్రితం తెలుగులో ఏ సినిమా పోస్టర్, పాటలు, ట్రైలర్ రిలీజైనా సరే ఒక్కటే ప్రశ్న. 'రాధేశ్యామ్' అప్డేట్స్ ఎక్కడా అని. అయితే వాటికి సమాధానంగా ఇటీవల కాలంలో పాటలు, టీజర్ విడుదల చేసి ఫ్యాన్స్‌ను సంతృప్తిపరిచారు.
రిలీజ్ దగ్గరపడుతున్నప్పటికీ సినిమా గురించి అభిమానులకు తెలిసింది చాలా తక్కువే. వాళ్ల ప్రశ్నలు అన్నింటికీ సమాధానమిచ్చేందుకు 'రాధేశ్యామ్' డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ వచ్చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Radhakrishna kumar: దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దగ్గర తాను తొమ్మిదేళ్ల పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశానని రాధాకృష్ణ చెప్పారు. తన మొదటి చిత్రం 'జిల్' యూవీ క్రియేషన్స్ నిర్మించిందని, ఆ తర్వాత ప్రభాస్‌కు 'రాధేశ్యామ్' కథ వినిపించానని తెలిపారు.
ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయని రాధాకృష్ణ కుమార్ వెల్లడించారు. ప్రభాస్ నటన ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుందని, సినిమా మొత్తం అతడు కళ్లతో నటించేశాడని ఈ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. సెట్లో ప్రభాస్ చిన్నపిల్లాడిలా ఉంటారని, ఈ సినిమాలో డార్లింగ్ వన్ మ్యాన్ షో చూస్తారని రాధాకృష్ణ చెప్పారు.
Prabhas radhe shyam: 'రాధేశ్యామ్'లో మొత్తం 16 పాత్రలు ఉంటాయని చెప్పిన రాధాకృష్ణ.. ప్రభాస్ తల్లిగా అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ నటించారని అన్నారు. అలానే ఓ కీలకపాత్రలో కృష్ణంరాజు కనిపిస్తారని.. అదే పాత్రను ఉత్తరాదిలో సత్యరాజ్ చేశారని తెలిపారు.
ఈ సినిమాలో పూజాహెగ్డే ప్రశ్న అయితే.. ప్రభాస్ దానికి సమాధానంగా నిలుస్తారని రాధాకృష్ణ చెప్పారు. మన దేశంలో ప్రారంభమయ్యే 'రాధేశ్యామ్' కథ.. రోమ్, లండన్‌లో ఉంటుందని తెలిపారు. అలానే మంచి పర్వతంపై కూర్చుని సూర్యాస్తమయం చూస్తున్నట్లు ఈ సినిమా ఉంటుందని అన్నారు.
1970ల నాటి కథతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ పామిస్ట్‌గా(హస్తరేఖలు చూసి భవిష్యత్ చెప్పే వ్యక్తి) కనిపించారు. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీలో పూజాహెగ్డే హీరోయిన్. దక్షిణాదిలో జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమా విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి:
- 'రాధేశ్యామ్' సినిమా 'గీతాంజలి' మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందా?
- 'ఆర్ఆర్ఆర్' నిడివి 3 గంటలపైనే.. 'పుష్ప', 'రాధేశ్యామ్' ఎంతంటే?
- ఒమిక్రాన్ భయం.. సంక్రాంతికి సినిమాలు రిలీజ్ కష్టమేనా?
- అక్కినేని నుంచి ప్రభాస్ వరకు.. ప్రేమ కోసం 'పునర్జన్మ'!
- ప్రభాస్ పారితోషికం అన్ని కోట్లా?.. ఏ హీరోకు లేనంత!
- Radheshyam story: ప్రభాస్ 'రాధేశ్యామ్' కథ లీక్!
- 'రాధేశ్యామ్'.. రికార్డు స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్!
- 'రాధేశ్యామ్'కు సీక్వెల్.. క్లారిటీ అప్పుడే..!?