ETV Bharat / sitara

'పుష్ప'.. ఆ భాషలో విడుదల వాయిదా! - రష్మిక మందన

Pushpa release postponed: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'పుష్ప' రాజ్ వచ్చేశాడు. దేశవ్యాప్తంగా థియేటర్లలో శుక్రవారం విడుదలైన ఈ సినిమా.. అభిమానులు ఊపేస్తోంది. అయితే ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్​ చేయగా.. మలయాళం వెర్షన్​ మాత్రం శనివారానికి వాయిదా పడినట్లు సమాచారం.

Pushpa release postponed
పుష్ప
author img

By

Published : Dec 17, 2021, 10:22 AM IST

Pushpa release postponed: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' కోసం ఎదురు చూసిన అభిమానులకు థియేటర్లలో ఫుల్​ మీల్స్​ పెట్టేశారంట. ట్విట్టర్​లో ఇప్పటికే సినిమాకు మంచి రివ్యూలు వస్తున్నాయి. బన్నీ తన ప్రదర్శనతో ఇరగదీశాడంట. దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని తొలుత మేకర్స్​ భావించారు. అనుకున్న సమయానికే విడుదల చేసేందుకు చాలా శ్రమించారు. అయితే ఒక భాషలో మాత్రం ఈ సినిమా శుక్రవారం విడుదల కావడం లేదని తెలుస్తోంది. అదే మలయాళం.

కేరళలో బన్నీకి చాలా మంది ఫ్యాన్స్​ ఉన్నారు. అతడిని ప్రేమగా మల్లు అర్జున్ అని కూడా పిలుచుకుంటారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా డిసెంబర్​ 18న మలయాళం వెర్షన్​ విడుదలవుతుందని సమాచారం. అప్పటివరకు తమిళ భాష ప్రింట్​ను కేరళలో ప్రదర్శిస్తారట.

ఇదీ చూడండి: పుష్ప సినిమా.. ఛాలెంజ్​ చేసిన అల్లు అర్జున్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.